విజయ్ సేతుపతి సినిమాలో ‘విలేజ్ డాన్సర్’గా కనిపించనున్న స్టార్ హీరోయిన్..!

0

తెలుగుతో పాటు తమిళ.. హిందీ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయినుగా ఎదిగింది శృతిహాసన్. అమ్మడు కాటమరాయుడు సినిమా తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. ఆ మధ్య రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే లవ్ బ్రేకప్ కావడంతో మళ్లీ సినిమాల పై దృష్టి పెట్టింది ముద్దుగుమ్మ. నిజానికి సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం.. తమిళం హిందీలో ఒక్కో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన క్రాక్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ సినిమాలో కనిపించనుంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన శృతి ఎల్లపుడు సోషల్ మీడియాలో ఏదొక పోస్ట్ చేస్తూ తన అభిమానులకు చేరువవుతుంది.

ఇక తెలుగు అనువాద చిత్రం పిజ్జాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలలో విజయ్ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం హీరోగానే కాకుండా నటుడిగా ఇతర హీరోల సినిమాలలో క్యారెక్టర్స్ చేస్తూ స్టార్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇటీవలే తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ రోల్ ప్లే చేసాడు. అయితే ఆయన హీరోగా మాత్రం వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో ‘లాభం’ సినిమా ఒకటి. అయితే తాజాగా శృతి.. విజయ్ సేతుపతి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. లాభం సినిమాలో శృతి ఓ గ్రామీణ నృత్య కళాకారిణిగా కనిపించబోతుందట. అయితే ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న శృతికి ఓ మంచి క్యారెక్టర్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతుందట. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ సంఘ సేవకుడిగా కనిపిస్తాడని సమాచారం. చూడాలి మరి గ్రామీణ డాన్సర్ గా శృతి ఏ మాత్రం మెప్పిస్తుందో..!!