ఇండస్ట్రీలో ఎంతో మంది ఉంటారు. వారిలో గుర్తింపు కోసం పోరాడే వారు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపును దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాని అతి కొద్ది మందికి మాత్రమే ఆ ఆఫర్ దక్కుతుంది. అయితే ఆ ఆఫర్ ఎలా దక్కుతుంది.. ఎవరి ద్వారా వెళ్లాలి అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఇంతకు ముందు సినిమాల్లో ఆఫర్ ల కోసం స్టూడియోల చుట్టు తిరిగే వారు.. ఇప్పుడు సీరియల్స్ మరియు షో ల కోసం టీవీ చానెల్స్ చుట్టు తిరుగుతున్నారు. బిగ్ బాస్ టాప్ 3 గా నిలిచిన సోహెల్ కూడా చాలా ప్రయత్నించాడట. అయితే స్టార్ మా లో ఉన్న ఒక వ్యక్తి రికమండేషన్ వల్లే ఆఫర్ వచ్చిందని సోహెల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు.
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సీరియల్స్ లో కూడా నటిస్తున్న నాకు బిగ్ బాస్ లోకి వెళ్లాలి అనేది చాలా కోరిక. అందుకోసం మాటీవీలో తెలిసిన ఒక అన్నను అడుగుతూ వచ్చాను. ఆ అన్న మొదట చూద్దాంలే అన్నాడు. నేను ప్రతి రోజు ఫోన్ లు మెసేజ్ లు చేసేవాడిని. ఒక రోజు ఆ అన్న నాకు కాల్ చేసి నీవు బిగ్ బాస్ కు ఎంపిక అయ్యావు అంటూ చెప్పాడు అంటూ ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని సోహెల్ చెప్పాడు. రికమండేషన్ వల్లే సోహెల్ బిగ్ బాస్ లో ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నా వారు పెరిగి పోయారు. ఇప్పటికే వీడియో స్కాం అంటూ ఆయన ఆనందాన్ని కిల్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో స్వయంగా నోరు జారి ఆ అన్న వల్లే నేను బిగ్ బాస్ కు వెళ్లాను అంటూ చెప్పడంతో మళ్లీ బుక్ అయ్యాడు.