బెడ్ రూమ్ లో వేడి పెంచుతున్న కుర్రబ్యూటీ

0

ముంబై బ్యూటీ సోనారిక బదోరియా బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోటైన నటీమణిగా పాపులర్. ఇటు దక్షిణాది తెరపైనా ఈ అమ్మడు వెలుగులు విరజిమ్మేందుకు ప్రయత్నిస్తోంది. తమిళంలో ఒక మూవీ.. తెలుగులో ఒక మూవీ చేసింది ఈ భామ.

ముంబై రాజ్పుత్ ఫ్యామిలీకి చెందిన ఈ బ్యూటీ కన్స్ట్రక్షన్ బిజినెస్ రంగంలోనూ ఆర్జిస్తున్నామని తెలిపింది. బాగా చదివి కలెక్టర్ కావాలని అనుకున్న ఈ అమ్మడు అనుకోకుండా నటి అయ్యిందట. మొదట టీవిలో ఓ హిందీ సీరియల్లో నటించింది. అది తెలుగులో కూడా ప్రసారం అయ్యింది.

ఆ తర్వాత వెండితెర అవకాశం అందుకున్నానని తెలిపింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి అడిగితే .. తమిళ చిత్రం `సుందరపాండియన్` ను తెలుగులో డబ్ చేస్తున్నారని ఈ భామ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. శౌర్య `జాదూగాడు` తరువాత ఇంకా రెండు కొత్త ప్రాజెక్టులను అంగీకరించానని తెలిపింది. ఇక ఈ భామ సోషల్ మీడియాల్లో రెగ్యులర్ గా వేడెక్కించే ట్రీట్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా బెడ్ రూమ్ లో విరహయోగినిలా సోనారిక ఇచ్చిన ఫోజులు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.