ఇక్కడ బెల్లకొండ.. అక్కడ విశాల్…!

0

సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చాక వెనక్కి తిరిగి చూడాలని ఎవరూ అనుకోరు. అదే ఇమేజ్ ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మేల్ డామినేషన్ ఉండే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా అలానే ఆలోచిస్తుంటారు. హీరోయిన్ గా కొనసాగినన్ని రోజులు మంచి ఇమేజ్ తెచ్చుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాత మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలతో నటించడానికి వెనకడుతుంటారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలతో నటించడానికి స్టార్ హీరోయిన్స్ రెడీగా ఉంటారు. వారెవరో కాదు బెల్లకొండ శ్రీనివాస్ – విశాల్.

కాగా ‘అల్లుడు శీను’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. తాను నటించే ప్రతి సినిమాలో స్టార్ హీరోయిన్ ఉండేలా చూసుకుంటాడు. ఈ క్రమంలో అక్కినేని సమంత – కాజల్ అగర్వాల్ – పూజాహెగ్డే – తమన్నా – రకుల్ ప్రీత్ సింగ్ – అనుపమ పరమేశ్వరన్ – మెహ్రీన్ – నభా నటేష్ వంటి హీరోయిన్స్ తో కలిసి నటించాడు బెల్లంకొండ. కోలీవుడ్ లో విశాల్ కూడా తన సినిమాల్లో ఆల్మోస్ట్ స్టార్ హీరోయిన్స్ నే తీసుకుంటున్నాడు. అయితే ఈ ఇద్దరు హీరోల సినిమాలలో నటించడానికి స్టార్ హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణంగా వారి సినిమాలకు ఇచ్చే రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. ఈ హీరోల సినిమాలలో హీరోయిన్లకి మార్కెట్ రేటు కంటే ఎక్కువ ఇస్తారని టాక్. సినిమా హిట్ అయితే డబ్బులతో పాటు క్రెడిట్ కొట్టేయొచ్చు.. అదే ప్లాప్ అయితే రెమ్యూనేషన్ ఎలానూ ఎక్కువగానే వస్తోందిగా అనే విధంగా హీరోయిన్స్ ఆలోచిస్తున్నారని కాస్టింగ్ వర్గాలు చెప్తున్నాయి.