ఇది కదా రెడ్ హాట్ అంటే..!

0

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతల అందాల ప్రదర్శణ విషయంలో ఏమాత్రం వెనకాడదు అనే విషయం తెల్సిందే. బుల్లి తెర నుండి వెండి తెరపైకి వచ్చి వెలిగి పోతున్న ఈ అమ్మడు సౌత్లో ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. తెలుగుతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. ఓటీటీ కోసం రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ లో ఇప్పటికే ఊర్వశి రౌతల పాల్గొంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో సౌత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ అమ్మడికి సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు.

30 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ ను పెడుతూనే ఉంటుంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఈ ఫొటో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెడ్ అండ్ రెడ్ లో మెరిని ఊర్వసి వైట్ మాస్క్ ధరించి చేతిలో చిన్న పౌచ్ పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్తుంటే మీడియా కెమెరాలు క్లిక్ మన్నాయి. బయటకు వచ్చినప్పుడు కూడా చాలా కంఫర్ట్ ఉండే డ్రస్ లు వేసుకుంటూ ఉండే ఊర్వశి ఈసారి తన రెడ్ డ్రస్ తో యూత్ కు ఉక్క పోసేసేలా చేసింది. రెడ్ హాట్ అంటే అసలైన అర్థం కు ఈ ఫొటో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.