Templates by BIGtheme NET
Home >> Cinema News >> విజయ్ దేవరకొండ అలాంటి పాత్రలో నటిస్తాడా..?

విజయ్ దేవరకొండ అలాంటి పాత్రలో నటిస్తాడా..?


యంగ్ హీరో విజయ్ దేవరకొండ – స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా కేదార్ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని 2022 లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు మేకర్స్ ఇంతకు ముందే ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని 2021 ఆగస్ట్ లోనే స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం సుక్కు మరియు విజయ్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. సుకుమార్ అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి కంప్లీట్ అయితే సుక్కు-విజయ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇదిలా వుండగా సుకుమార్ – విజయ్ దేవరకొండ కాంబోలో మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా స్టోరీ ఇదేనంట సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇదొక పీరియాడికల్ మూవీ అని.. ఇండియా – పాకిస్తాన్ విడిపోయిన కాలంలో జరిగిన యుద్ధం నేపథ్యాన్ని తీసుకుని సుక్కు ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నారని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ డెఫిషియన్సీతో బాధపడే యువకుడిగా కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ ని చెవిటి వాడిగా చూపించినట్లే.. సుకుమార్ ఇందులో విజయ్ తో ఛాలెంజింగ్ రోల్ చేయిస్తున్నాడట. ఇదే కనుక నిజమైతే మాత్రం ఈ మూవీ విజయ్ కి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.