బ్యాంకాక్ ట్రిప్ లో సుశాంత్..సారా..3 రోజులు బయటకు రాలేదట!

0

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చర్చ సాగుతోంది. ఓవైపు కరోనాకు సంబంధించిన అప్డేట్స్ ఎడతెగని రీతిలో సాగుతున్నట్లే.. సుశాంత్ అంశంపై కొత్త కొత్త విషయాలు డైలీ బేసిస్ లో బయటకు వస్తున్నాయి. సుశాంత్ ఎపిసోడ్ లో రియా కేంద్రంగా చాలానే చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె చెప్పిన కొన్ని అంశాలు కొత్త చర్చకు తెర తీశారు. బ్యాంకాక్ కు తన మగ స్నేహితులతో కలిసి వెళ్లినట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సుశాంత్ సన్నిహితులు మరో చానల్లో పాల్గొన్నారు. వారు మరికొన్ని కొత్త అంశాల్ని బయటపెట్టారు. వారి మాటల ప్రకారం బ్యాంకాక్ ట్రిపులో సుశాంత్ తో పాటు సారా ఆలీఖాన్ ఉన్నట్లు చెప్పి కొత్త వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

సుశాంత్ తన స్నేహితులతో పాటు సారా ఆలీఖాన్ తో కలిసి బ్యాంకాక్ లోని విలాసవంతమైన ఐలాండ్ లోనిఒక హోటల్ లో బస చేశామని.. ఆ హోటల్ నుంచి సుశాంత్.. సారాలు మూడు రోజులు ఉన్నారని.. బయటకు ఒక్కసారి కూడా రాలేదన్నారు. తామంతా బ్యాంకాక్ లోని ప్రదేశాలు చూడటానికి వెళ్లినట్లు చెప్పటం కొత్త వివాదానికి తెర తీసింది. థాయ్ లాండ్ కు సునామీ హెచ్చరికలు రావటంతో బ్యాంకాక్ ట్రిప్ మధ్యలో ఆపేసి సుశాంత్.. సారాలు ముంబయికి తిరిగి వచ్చారని వెల్లడించారు.

తాము మాత్రం బ్యాంకాక్లోనే ఉండిపోయామని.. ఆ సందర్భంగా ఖర్చుల కోసం తన ఏటీఎం కార్డు తమకిచ్చినట్లుగా సాబిర్ అహ్మద్ వెల్లడించారు. రియా తన ఇంటర్వ్యూలో సారా ప్రస్తావన తేకుండా.. మగ స్నేహితుల గురించి మాత్రమే ఎందుకు ప్రస్తావించారు? సారాఆలీఖాన్ గురించి ఎందుకు చెప్పలేదు? అసలు బ్యాంకాక్ ట్రిప్ గురించి రియా ఎందుకు బయటపెట్టింది? దాని వెనుక అసలు విషయం ఏమిటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయని చెప్పక తప్పదు.