స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించబోతున్న తమన్నా…?

0

కోలీవుడ్ క్రేజీ కాంబినేషన్స్ లో ఇళయదళపతి విజయ్ – డైరెక్టర్ మురగదాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరిద్దరి కలయికలో ఇప్పటి వరకు రూపుదిద్దుకున్న మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ‘తుపాకీ’ ‘కత్తి’ ‘సర్కార్’ వంటి సినిమాలు తమిళ్ తోపాటు తెలుగులో కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో విజయ్ తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు విజయ్ – మురగదాస్ లు నాలుగోసారి కలవబోతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 2012 లో విడుదలైన బ్లాక్ బస్టర్ సాధించిన ‘తుపాకి’ సినిమాకి సీక్వెల్ స్టోరీ మురగదాస్ రెడీ చేసారట. ఇప్పటికే విజయ్ కి ఈ స్టోరీ చెప్పారని.. దానికి విజయ్ సీక్వెల్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. విజయ్ – మురుగుదాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా నటించబోతుందని తెలుస్తోంది.

కాగా మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్ళవుతున్నా ఇప్పటికి కొత్త హీరోయిన్లకు పోటీ ఇస్తూ అవకాశాలు అందుకుంటోంది. అయితే ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ పోషిస్తూ వచ్చిన తమన్నా ఫస్ట్ టైం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి రెడీ అయిందట. విజయ్ – మురుగుదాస్ కాంబోలో రానున్న ‘తుపాకీ 2’లో అమ్మడు విలన్ గా కనిపించనుందట. ఈ సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధానత్య ఉంటుందని.. తమన్నా పాకీస్థానీ స్పైగా కనిపించబోతోందని వార్తలు వస్తున్నాయి. త్రిష – వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి హీరోయిన్స్ విలన్ రోల్స్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కూడా సిరీస్ కోసం నెగెటివ్ రోల్ లో కనిపించనుంది. మరి ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ ఛాలెంజింగ్ రోల్ లో మెప్పిస్తుందేమో చూడాలి.