ఆహా అనిపిస్తున్న తమషా హర్ష

0

తెలుగు ఓటీటీ ఆహా కొత్త కంటెంట్ తో మరింత మంది అభిమానంను చురగొనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆహా వారు చేస్తున్న కార్యక్రమాలతో చిన్న నటీనటులకు మరియు యూట్యూబర్స్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తమాషా విత్ హర్ష కార్యక్రమం ఎంటర్ టైన్ గా ఉంటుంది. అంతకు ముందు సుమ హోస్ట్ గా ఆల్ ఈజ్ వెల్ అనే టాక్ షో వచ్చేది. ఇప్పుడు తమాషా విత్ హర్ష మరియు సామ్ జామ్ టాక్ షో లు ఆహా లో వస్తున్నాయి.

సామ్ జామ్ కంటే ఒక వారం ముందే ప్రారంభం అయిన తమాషా విత్ హర్షకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నెటిజన్స్ చర్చించుకుంటున్న దాని ప్రకారం సమంత సామ్ జామ్ కంటే కూడా హర్ష హోస్ట్ చేసిన తమాషా విత్ హర్ష టాక్ షో రెండు ఎపిసోడ్ లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అంటున్నారు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉన్నా ఆహాలో ప్రస్తుతం తమాషా విత్ హర్ష ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

హర్ష ‘ఆహా’లో వచ్చిన కలర్ ఫొటో సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. యూట్యూబర్ అయిన హర్ష ఇప్పుడు ఆహాలో ఎక్కువ కంటెంట్ లో కనిపిస్తున్నాడు. హర్ష ఒక వెబ్ సిరీస్ లో కూడా ఆహా కోసం నటించాడు. సామ్ జామ్ లో కూడా మద్య మద్యలో వస్తూ పోతూ ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.