లాక్ డౌన్ తర్వాత రాబోతున్న మొదటి బిగ్గెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ 2’

0

కన్నడ మూవీ కేజీఎఫ్ 2 షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు షూటింగ్ కు బ్రేక్ రావడంతో సినిమాను అనుకున్నట్లుగా ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేయలేక పోతున్నారు. కనీసం ఈ సినిమాను సంక్రాంతికి అయినా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో తీవ్రంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కరోనా భయం ఉన్నా కూడా గత నెలలోనే షూటింగ్ ను ప్రారంభించారు. ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు కీలక స్టార్స్ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని కన్నడ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుందని యూనిట్ సభ్యులు తెలియజేశారట.

లాక్ డౌన్ కారణంగా ఏడు నెలల పాటు థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఈనెల 15 నుండి దేశ వ్యాప్తంగా కంటోన్మెంట్ ఏరియాల్లో మినహా మొత్తం ఓపెన్ అవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న బడ్జెట్ సినిమాలు గతంలో విడుదల ఆగిపోయిన సినిమాలు ఇప్పుడు విడుదలకు రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు భారీ సినిమాలు ఏవీ కూడా ఈ ఏడాదిలో రాబోతున్నట్లుగా ప్రకటించలేదు.

కేజీఎఫ్ 2 కూడా వచ్చే ఏడాది సంక్రాంతి ముందే అంటే జనవరి మొదటి లేదా రెండవ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే కేజీఎఫ్ 2 సినిమా దేశంలో లాక్ డౌన్ తర్వాత రాబోతున్న మొదటి పెద్ద సినిమాగా నిలవనుంది. వంద కోట్ల బడ్జెట్ సినిమాలు ఏవీ కూడా ఈ మహమ్మారి టైం లో వచ్చేందుకు సిద్దంగా లేవు. కేజీఎఫ్ 2 మాత్రం సంక్రాంతికి రావాలని రెడీ అవుతుంది. అప్పటి వరకు పరిస్థితులు అన్ని కుదుట పడుతాయని అంతా నమ్మకంగా ఉన్నారు. ఆ కారణంగానే కేజీఎఫ్ 2 సంక్రాంతికి వస్తుందని అంటున్నారు.