కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు చాలామంది దీని బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా అనేకమంది ప్రముఖులకు కరోనా సోకగా.. చికిత్స తీసుకొని బయటపడ్డారు. రాజమౌళి – కీరవాణి ల కుటుంబం – బండ్ల గణేష్ – నాగబాబు – తమన్నా వంటి వారు కోవిడ్-19 బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ జంట రాజశేఖర్ – జీవిత లకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. రాజశేఖర్ – జీవిత దంపతులకు వారం రోజుల క్రితమే కరోనా సోకగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది.
తాజాగా రాజశేఖర్ తన ఫ్యామిలీకి కరోనా సోకిందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ”నాకు జీవిత మరియు పిల్లలకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించబడిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని వస్తున్న వార్తలు నిజమే. పిల్లలు ఇద్దరూ దాని నుండి పూర్తిగా బయటపడ్డారు. జీవిత మరియు నేను చాలా బాగున్నాము. త్వరలో ఇంటికి తిరిగి వస్తాము! ధన్యవాదాలు!” అని రాజశేఖర్ ట్వీట్ చేశాడు. కాగా గతేడాది ‘కల్కి’ సినిమాతో వచ్చిన రాజశేఖర్.. ప్రముఖ దర్శకుడు నీలకంఠతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు రాజశేఖర్ కుమార్తె శివానీ.. తేజా సజ్జా హీరోగా పరిచయం అవుతున్న సినిమాతో హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతోంది. ఇప్పటికే చిన్నమ్మాయి శివాత్మిక రాజశేఖర్ ‘దొరసాని’ సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రశంసలు దక్కించుకుంది.
The news is true that Jeevitha, Kids and I have tested positive for corona and are currently being treated in the hospital.
Both the kids are completely out of it, Jeevitha and I are feeling much better and will be back home soon!
Thank you !— Dr.Rajasekhar (@ActorRajasekhar) October 17, 2020
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
