అమ్మ కథే ‘సు మతి’

0

తీసిన రెండు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా మంచి లాభాలను దక్కించుకున్న దర్శకుడు వెంకటేష్ మహా. తెలుగు ప్రేక్షకులు మరీ నాచురల్ గా ఉన్న కథలను మరియు సినిమాలను చూడరు అనే టాక్ ఉంది. కాని దాన్ని ఈయన బ్రేక్ చేశాడు. కేరాఫ్ కంచరపాలెం అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు ఆ తర్వాత మలయాళ మూవీ మహేషింటే ప్రతికారం ను తెలుగులో రీమేక్ చేసి మరోసారి సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఇక మూడవ ప్రయత్నంగా ‘సు మతి’ అనే సినిమాను ఆయన ప్రకటించాడు.

మొదటి రెండు సినిమాలను పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కించిన ఈయన మూడవ సినిమాను అమెరికాలోని ఎంపైర్ స్టేట్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ తో క్లారిటీ వచ్చేసింది. ఒక పల్లెటూరు వృద్దురాలు సిటీకి వచ్చిన సమయంలో ఆమె ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూపించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ తోనే దర్శకుడు చెప్పకనే చెప్పాడు. ఈ కథను దర్శకుడు మహా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్నట్లుగా సమాచారం.

తన జీవితంలో జరిగిన ఒక మహిళ జీవితాన్ని అతడు ఈ సినిమాలో కాస్త డ్రమటిక్ గా చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాను పరుచూరి విజయ ప్రవీణ నిర్మిస్తుంది. ఈమె కేరాఫ్ కంచరపాలెం నిర్మాత కూడా అనే విషయం తెల్సిందే. ఆ సినిమాలో కీలక పాత్రలో ఈమె నటించింది. మళ్లీ వీరి కాంబోలో మరో హిట్ రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.