Templates by BIGtheme NET
Home >> Cinema News >> అఘోరా పాత్రలో మాస్ కా దాస్..?

అఘోరా పాత్రలో మాస్ కా దాస్..?


టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ ‘ఈ నగరానికి ఏమైంది’ ‘ఫలక్ నుమా దాస్’ ‘హిట్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాతోనే కాకుండా తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో యూత్ లో క్రేజ్ ఏర్పరచుకొని ‘మాస్ కా దాస్’ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ‘పాగల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ లో బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు వరుస హిట్ సినిమాలతో జోష్ మీదున్న విశ్వక్ సేన్.. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ‘పాగల్’ షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచేరీలో జరుగుతోందని సమాచారం.

ఇదిలా ఉండగా విశ్వక్ సేన్ ఓ పక్క ‘పాగల్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు సైలెంట్ గా ఓ కొత్త మూవీని ప్రారంభించి చిత్రీకరణ చేస్తున్నాడట. అంతేకాకుండా ఇందులో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నాడట. ఇదే కనుక నిజమైతే విశ్వక్ సేన్ కి ఈ ఛాలెంజింగ్ రోల్ మరింత గుర్తింపుని తీసుకొస్తుందని చెప్పవచ్చు. దీంతోపాటు మలయాళ సూపర్ హిట్ ‘కప్పెల’ తెలుగు రీమేక్ లో కూడా విశ్వక్ కీలక పాత్రలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. అలానే తమిళ్ హిట్ మూవీ ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్ కూడా విశ్వక్ సేన్ నటించనున్నాడని సమాచారం. మాతృకను డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తు తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మాస్ కా దాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ మంచి ఫార్మ్ లో దూసుకుపోతున్నాడని చెప్పవచ్చు.