ఇలాంటి వెబ్ సిరీస్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్

0

గత కొన్ని నెలలుగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘నవరస’ అనే 9 ఎపిసోడ్ ల వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రసంతో కథ నడుస్తుంది. హాస్యం.. కోపం.. రొమాన్స్ ఇలా 9 ఎపిసోడ్ లను ప్రముఖ నటీనటులతో మణిరత్నం రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాని ఈ వెబ్ సిరీస్ గురించి ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చను బట్టి చూస్తుంటే ఇలాంటి వెబ్ సిరీస్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా అనిపిస్తుంది.

ఈ వెబ్ సిరీస్ లోని 9 ఎపిసోడ్స్ కు 9 మంది ప్రముఖులు దర్శకత్వం వహించబోతున్నారు. ప్రముఖ దర్శకులు అయిన కేవీ ఆనంద్.. గౌతమ్ మీనన్.. బిజోయ్ నంబియార్.. కార్తీక్ సుబ్బరాజు.. పొన్ రామ్.. హలిత షలీమ్.. కార్తీక్ నరేన్.. రతీంద్రన్ ప్రసాద్.. అరవింద్ స్వామిలు దర్శకత్వం వహించబోతున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించకుండా అన్ని ఎపిసోడ్ ల దర్శకత్వంను పర్యవేక్షించబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటించబోతున్నారు. 20 మంది స్టార్ నటీనటులు ఈ వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నారు. సూర్య మరియు విజయ్ సేతుపతిలతో సహా పలువురు ప్రముఖులు కనిపించబోతున్నారు. 8 మంది సంగీత దర్శకులు 9 మంది ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు ఈ వెబ్ సిరీస్ కు పని చేయబోతున్నారు. ఇంత మంది ప్రముఖులు కలిసి ఒక్క వెబ్ సిరీస్ చేయడం ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు. అందుకే ఇలాంటి వెబ్ సిరీస్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనిపిస్తుంది. తమిళంలో రూపొందబోతున్న ఈ వెబ్ సిరీస్ ఇండియన్ అన్ని భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా డబ్ అవ్వబోతుంది.

మణిరత్నం మరియు జయేంద్రలు కలిసి ఈ వెబ్ సిరీస్ ను భారీ మొత్తంతో నిర్మించబోతున్నారు. ప్రముఖ ఓటీటీ ఈ వెబ్ సిరీస్ ను రికార్డు ప్రైజ్ పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందని తమిళ మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఇంత మంది టెక్నీషియన్స్ మరియు నటీ నటులను ఒక్క ప్రాజెక్ట్ కోసం ఒప్పించడం అనేది కేవలం మణిరత్నంకు మాత్రమే సాధ్యం అయ్యింది.