Templates by BIGtheme NET
Home >> Cinema News >> RGV లో రాంగ్ ఏంటో పర్ఫెక్ట్ గా చూపించిన మూవీ

RGV లో రాంగ్ ఏంటో పర్ఫెక్ట్ గా చూపించిన మూవీ


తనకు గిట్టని వాళ్లను సూటిగా విమర్శించేస్తూ సెటైరికల్ మూవీస్ ని తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ. చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. చిరంజీవి ఇలా అందరినీ విమర్శించారు తన సినిమాల్లో. కొందరిని బఫూన్ తరహా పాత్రలతో డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిచ్చింది. కానీ అందుకు భిన్నంగా రాంగోపాల్ వర్మలో రాంగ్ ఏమిటన్నది చూపిస్తూ సీనియర్ ఫిలింక్రిటిక్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన `రాంగ్ గోపాల్ వర్మ` ట్రెండీ టాపిక్ గా మారింది.

RGV పేరు ఎప్పుడూ సేలబుల్ పాయింట్ అయినా ఆయనను విమర్శించే కోణం కంటే రామ్ గోపాల్ వర్మ `తనను తాను టార్గెట్ చేసుకున్నారు` అనే కోణంలో తీసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఆర్జీవీ తనను తానే లక్ష్యంగా చేసుకోవడం గురించి ఈ చిత్రం పూర్తిగా ఎగతాళి చేస్తుంది. మూవీలో ఎక్కడా RGVని బాధితుడిని చేయలేదు. ఈ చిత్రం ఆర్జీవీని అన్ని రకాలుగా విశ్లేషణాత్మకంగా చూపిస్తుంది. ఇక ఆర్జీవీని చూపించిన శైలిలో ఎక్కడా తన స్వేచ్ఛా హక్కును సృజనాత్మక హక్కుని దుర్వినియోగం చేసినట్టు కనిపించదు.

ఇక ఈ చిత్రంలో షకలక శంకర్ టైటిల్ రోల్ పోషించారు. ఆర్జీవీకి డిట్టోగా ఆ పాత్రలో అతడు జీవించాడనే చెప్పాలి. షకలక శంకర్ ఎంపిక దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో సరైనదేననడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆర్జీవీ వ్యవహారికం భాష యాస ప్రతిదీ షకలక శంకర్ డిట్టోగానే చేసి చూపించగలిగారు. ఒక రకంగా ఆ పాత్రకు ప్రామాణికతను అందించారనే చెప్పాలి. ఆర్జీవీ డేరింగ్ యాటిట్యూడ్ .. వివాదాస్పదమైన భాష.. టెంప్టింగ్ వైఖరిని విమర్శించడానికి ఉద్దేశించిన చిత్రం అయినప్పటికీ ఎక్కడా అశాస్త్రీయమైన విమర్శలను ఆశ్రయించలేదు. ఆర్జీవీ తార్కిక ఆలోచనను తప్పు పట్టకుండానే రాంగ్ ఏమిటో చూపించడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పాలి.