అల్ట్రా స్టైలిష్ లుక్ లో యంగ్ రెబల్ స్టార్…!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతీ సినిమాకు కూడా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమాకు తగ్గట్టు లుక్ లో వేరియేషన్ చూపిస్తూ వచ్చాడు. కరోనా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన డార్లింగ్.. బయటకు వచ్చిన ప్రతిసారి న్యూ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో లేటెస్టుగా సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చి మరోసారి అభిమానులకు కిక్ ఇచ్చాడు ప్రభాస్. ట్రెండీ డ్రెస్ లో బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని కూర్చొని డార్లింగ్ ఇచ్చిన పోజ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంకేముంది ఈ అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న ప్రభాస్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.

కాగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ షూట్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు ప్రభాస్ మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షనల్ మూవీ చేయనున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఇక ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ మూవీలో నటించనున్నాడు ప్రభాస్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ- సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తారు.