అమెజాన్ కు గట్టి పోటీ ఇస్తున్న జీ5

0

నాని ‘వి’ సినిమా విడుదల తర్వాత మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు కూడా ఓటీటీ విడుదలకు రెడీ అవుతున్నాయి. వాటిలో సోలో బ్రతుకే సో బెటర్ మరియు ఒరేయ్ బుజ్జిగా సినిమాలు అతి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల ఓటీటీ రైట్స్ ను కూడా జీ5 దక్కించుకుందట. త్వరలోనే జీ 5 ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతుంది. ఈమద్య కాలంలో తెలుగు సినిమాలు ఎక్కువగా అమెజాన్ లో విడుదల అవుతున్నాయి. కొన్ని సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో కూడా విడుదల అవుతున్నాయి. కాని జీ5 మాత్రం మొదటి సారి తెలుగు ప్రముఖ సినిమాల రిలీజ్ కు సిద్దం అయ్యింది.

ఈమద్య కాలంలో ఓటీటీ ల మద్య పోటీ పెరిగింది. అమెజాన్ భారీ మొత్తాలు పెట్టి తెలుగు సినిమాల రైట్స్ ను కొనుగోలు చేస్తుంది. బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమాలను కూడా టార్గెట్ చేసిన జీ5 భారీ మొత్తాలకు తెలుగు సినిమాలను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. సోలో బ్రతుకే సోబెటర్ మరియు ఒరేయ్ బుజ్జి సినిమాలను అమెజాన్ కంటే ఎక్కువ కోట్ చేసి మరీ దక్కించుకుందట. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా జీ5 పలు తెలుగు సినిమాలపై కన్నేసిందని అలాగే వెబ్ కంటెంట్ పై కూడా దృష్టి పెట్టిందని సమాచారం అందుతోంది. ఇదే కనుక నిజం అయితే అమెజాన్ కు ముందు ముందు జీ 5 నుండి గట్టి పోటీ తప్పదు. ఈ రెండింటికి ‘ఆహా’ కూడా పోటీకి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది.