బేబి బంప్ తో `నువ్వు నేను` హీరోయిన్

0

బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోటైన కథానాయిక అనిత హసనందానీ. తేజ డిస్కవరీగా ఈ అమ్మడు సుపరిచితం. అంతకుముందు హిందీ టీవీ సీరియళ్లు చేసుకునే అనిత హసనందానీని పిలిచి ఉదయ్ కిరణ్ `నువ్వు నేను`లో అవకాశం ఇచ్చారు తేజ. ఉదయ్ లాంటి హ్యాండ్సమ్ హీరో సరసన అవకాశం అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మరోసారి అతడి సరసన శ్రీరామ్ అనే యాక్షన్ చిత్రంలోనూ నటించింది. టాలీవుడ్ లో పలు ఆఫర్లు అందుకున్నా ఇక్కడ స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆశ మాత్రం నెరవేరలేదు. అప్పట్లో ఉదయ్ మరణం సమయంలో ఎంతో కలతకు గురైన ఈ అమ్మడు అది ఊహించలేకపోయానని నివ్వెర పోయింది.

బాలాజీ టెలీ ఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ అనితకు హిందీ టీవీ పరిశ్రమలో అవకాశాలు కల్పించడంపైనా ఆసక్తికర చర్చ సాగింది. నాగిన్ 4లో అనిత ప్రధాన పాత్ర పోషించింది. `నచ్ బళియే` సీజన్ 9లోనూ అనిత హొయలు వేడెక్కించేసింది. అలాగే తాను ప్రేమించిన కార్పొరెట్ ఉద్యోగి రోహిత్ రెడ్డిని పెళ్లాడి సెటిలైనప్పటి నుంచి అనిత తన లైఫ్ స్టైల్ పరంగా ఎన్నో మార్పులు చేసింది. ఇటీవల ఈ జంట ఫోటోలు అంతర్జాలంలో జోరుగా వైరల్ అయ్యాయి.

తాజాగా అనిత హసనందాని శనివారం బేబి బంప్ విషయాన్ని ప్రకటించింది. ఆమె భర్త.. వ్యాపారవేత్త రోహిత్ రెడ్డి ఇన్ స్టాగ్రామ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆదర్శ జంట నడుమ అన్యోన్యతానురాగాలు హైలైట్ అయ్యాయి. నిశ్చితార్థం క్షణాలు .. వివాహ ప్రమాణాల వీడియోని హైలైట్ చేసింది ఈ జంట. రోహిత్ ఎంతో తన్మయుడై ఆ క్షణం అనిత బేబీ బంప్ ను ముద్దు పెట్టుకోవడం హైలైట్.

‘లవ్ యు @rohitreddygoa #gettingreadyforreddy’ అంటూ ఈ పోస్ట్ కు శీర్షికను పెట్టారు. అనిత స్నేహితులు బంధుమిత్రులు సోషల్ మీడియాల్లో అభినందన శుభాకాంక్షలు కురిపిస్తున్నాయి. ‘వావ్… వావ్… అభినందనలు. ఇది అద్భుతం ‘ అని నటుడు కరణ్వీర్ సింగ్ బొహ్రా వ్యాఖ్యానించారు.

అనితా – రోహిత్ 18 అక్టోబర్ 2013లో గోవాలో వివాహం చేసుకున్నారు.

 

View this post on Instagram

 

❤️+❤️=❤️❤️❤️ Love you @rohitreddygoa #gettingreadyforreddy

A post shared by Anita H Reddy (@anitahassanandani) on