గంగవ్వ అన్నట్లుగానే జోర్దార్ సుజాత ఔట్

0

గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్ ఏమీ లేకుండానే ఆమె అనారోగ్య కారణాల వల్ల బయటకు పంపిస్తున్నట్లుగా బిగ్ బాస్ ప్రకటించాడు. ఆమె వెళ్లి పోవడానికి ముందు స్టేజ్ పైకి వచ్చి ఒకొక్కరి గురించి మాట్లాడింది. ఆ సందర్బంగా సుజాత గురించి మాట్లాడుతూ ఈ వారం నువ్వు వస్తావని అంటున్నారు. నువ్వు బయటకు వచ్చినంకా కలుద్దాం అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. అన్నట్లుగానే సుజాత ఈ వారం ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో ఆమె ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాబోతుంది. సుజాత ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.

టాస్క్ ల విషయంలో మరియు గేమ్ విషయంలో ఆమె బాగానే ఉంటున్నా కూడా ప్రతి చిన్నదానికి ఆమె నవ్వడం.. ఏడ్వడం.. అలగడం వంటివి చేస్తుంది. ఆమె ఓవర్ యాక్షన్ ను బాబోయ్ అంటూ కొందరు ప్రేక్షకులు విసుక్కుంటున్నారు. ఇక నాగార్జునను పట్టుకుని బిట్టు అంటూ పిలవడం కూడా చాలా మందికి నచ్చడం లేదు. ఆమె ఎలిమినేషన్ కు ఎప్పుడెప్పుడు నామినేట్ అవుతుంది. ఎప్పుడు ఆమెను బయటకు పంపించాలా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ట్విట్టర్ లో సుజాత ఎలిమినేషన్ గురించి చాలా పెద్ద జరిగింది. ఆమె పలు కారణాల వల్ల ఇంట్లో ఉండే అర్హత కోల్పోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారు అనుకున్నట్లుగానే ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వబోతుంది.

సుజాత వయసులో చిన్న అయినా కూడా ఇతరులకు గౌరవం ఇవ్వక పోవడంతో పాటు మరీ చిన్న పిల్లలా ప్రవర్తించడం చేస్తుందని కొందరు కామెంట్స్ చేశారు. ఇక అభిజిత్ విషయంలో కూడా సుజాత వ్యవహరించే తీరు ఆశ్చర్యంగా అనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి బిగ్ బాస్ నుండి ఈ జోర్దార్ ఓవర్ యాక్షన్ పిల్ల ఎలిమినేట్ అవ్వబోతుందని లీక్ వచ్చేసింది. ఇప్పటి వరకు వచ్చిన లీక్ లు అన్ని నిజం అయ్యాయి. కనుక ఈ వారం సుజాత కన్ఫర్మ్ గా ఎలిమినేట్.