ట్రోల్స్ కు ఇలా సమాధానం చెప్పిన రౌడీ స్టార్

0

ఇటీవల ఓటు హక్కు గురించి విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. పేద వారికి మరియు ధనికులకు ఓటు హక్కును వినియోగించుకునే హక్కును తొలగించాలంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆ వ్యాఖ్యలు పలువురు పలు రకాలుగా విశ్లేషించుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడేసుకున్నారు. దాంతో విజయ్ దేవరకొండ తనపై వస్తున్న విమర్శలకు ఒక వీడియో విడుదల చేసి ఇండైరెక్ట్ గా సమాదానం ఇచ్చాడు. గొడ్డలి విసిరిన వీడియోను షేర్ చేసిన ఆయన ప్రయోజనకరమైన సరదా నియంత అంటూ కామెంట్ చేశాడు.

ఒక్క మాటతో తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేసిన విజయ్ దేవరకొండ మళ్లీ ఎవరు కూడా మాట్లాడకుండా గొడ్డలిని చూపించాడంటూ ఆయన అభిమానులు సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఏం చేసినా ఇంతే కఠినంగా ఉంటుంది. తన గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే మనిషి విజయ్ కాదంటూ అభిమానులు అంటున్నారు.

ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాను చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో ఒక సినిమాను ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఇంకో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణకు పూరి ఏర్పాట్లు చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కు పూరి.. విజయ్ ల మూవీ రాబోతుంది. ఆ తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో సినిమా ను మొదలు పెట్టి 2021లోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ తో ఈయన చేయబోతున్న సినిమాను 2022లో విడుదల చేసే అవకాశాలున్నాయి.