తల్లిగా నటించమంటే బుట్ట బొమ్మ కిసుక్కుమందట

0

`రుద్రమదేవి` వంటి చారిత్రక చిత్రం తరువాత స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ నుంచి సినిమా వచ్చి ఐదేళ్లవుతోంది. ఈ మూవీ తరువాత మైథలాజికల్ కథాంశం నేపథ్యంలో `హిరణ్యకశిప` చిత్రాన్ని చేయబోతున్నానని గుణ ప్రకటించారు. అమెరికాలో ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని.. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని గుణ-సురేష్ బాబు టీమ్ ప్రకటించారు.

అయితే ఇంతలోనే ట్విస్టు. హిరణ్య కశిపపై అప్ డేట్ ఇవ్వకుండానే సడన్ గా `శాకుంతలం` చిత్రాన్ని తాను రూపొందిస్తున్నట్టు ప్రకటించారు గుణశేఖర్. `హిరణ్యకశిప`ని సెట్స్ పైకి తీసుకురావడానికి మరింత సమయం అవసరం కాబట్టి ఆలోగా మరో చిత్రాన్ని రూపొందించబోతున్నానని క్లారిటీ ఇచ్చారు. మహాభారతంలోని శకుంతల.. కింగ్ దుశ్యంతుడి ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. అయితే ఈ చిత్రంలో నటించే శాకుంతల ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే కొంత మంది టాప్ లీగ్ హీరోయిన్ లని ఈ పాత్ర కోసం గుణశేఖర్ సంప్రదించారట. అందులో ప్రధానంగా ముందు బుట్టబొమ్మ పూజా హెగ్డేని అడిగారట. గత నెల పూజా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` షూట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెకు స్టోరీ చెప్పారట గుణశేఖర్. కథ విన్న తరువాత ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని తెలియడం… ఓ సన్నివేశంలో తల్లిగా కనిపించాల్సి రావడంతో ఈ స్క్రిప్ట్ ని పూజా తిరస్కరించినట్టు తెలిసింది. ఇప్పుడప్పుడే మహిళా ప్రధాన చిత్రాల్లో నటించడానికి పూజా ఆసక్తిగా లేదట ఆ కారణంగానే గుణశేఖర్ చిత్రాన్ని తిరస్కరించిందని తెలిసింది.