Templates by BIGtheme NET
Home >> MOVIE NEWS >> విరాట పర్వం లుక్: నక్సలైట్ నాయకుడు రవి అన్నా

విరాట పర్వం లుక్: నక్సలైట్ నాయకుడు రవి అన్నా


రానా నటిస్తున్న తాజా చిత్రం `విరాటపర్వం` ఆరంభం నుంచి యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీకి 1990 ల నాటి నక్సలిజం నేపథ్యం కనెక్ట్ చేసి తెరకెక్కిస్తుండడం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. రానా ఇందులో నక్సలైట్ గా ఉద్యమ నాయకుడిగా నటిస్తున్నారన్న గుసగుసలు వినిపించాయి. ఎట్టకేలకు విరాట పర్వం నుంచి రానా ఫస్ట్ లుక్ రిలీజైంది. 14 డిసెంబర్ రానా పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ లో రానా దగ్గుబాటి ముఖాన్ని ఎర్రటి కర్చీఫ్ తో కవర్ చేసి చూపించగా.. ఈసారి అతడి స్ట్రైకింగ్ లుక్ ని ఆవిష్కరించారు. నేడు పోస్టర్ తో పాటు విరాటపర్వంలో అతని పాత్ర పేరు కూడా రివీల్ చేశారు. నక్సలైట్ నాయకుడు రవి అన్నా పాత్రలో రానా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రానా తన బృందంతో పాటు తుపాకులతో ప్రత్యక్షమయ్యారు. అడవిలో ఫాగ్ మధ్యలోంచి ఉద్యమకారుల టీమ్ నడిచి వస్తున్నారు. ఆలివ్ గ్రీన్ యూనిఫాంలో రానా రూపం ఉద్యమస్ఫూర్తిని నింపుతోంది.

ఈ చిత్రంలోని ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకం. ప్రతి పాత్రకు స్వయం ప్రాముఖ్యతను ఆపాదించి ఉంటుంది. ఇప్పటికే రిలీజైన ప్రధాన నటుల ఫస్ట్ లుక్ పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. రానా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విరాటపర్వం మొదటి గ్లింప్స్ ఈ రోజు ఉదయం 11:07 గంటలకు ఆవిష్కరించనున్నారు.

ఇతర సినిమా పోస్టర్ల తరహాలొ కాకుండా ఇందులో మొదట సాయి పల్లవి పేరును వేశారు. ఆ తరువాత పోస్టర్లో రానా పేరును చూడవచ్చు. పోస్టర్ ని ఇలా డిజైన్ చేయాలని రానా తనకు ప్రాధాన్యతనిచ్చారని సాయి పల్లవి ఇంతకుముందు ఇంటర్వ్యూలో వెల్లడించారు. వాస్తవానికి టైటిల్ కార్డులలో కూడా సాయి పల్లవి పేరు రానా కంటే ముందు వస్తుందని సమాచారం. ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్ర ప్రాముఖ్యతను ఇది సూచిస్తుంది. విరాటపర్వం చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. కీలకమైన పాత్ర లో నివేదా పెతురాజ్ నటన ఆకట్టుకుంటుందని చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న షెడ్యూల్ లో నివేద పాల్గొంటున్నారు.

వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న విరాటపర్వం ఒక ప్రత్యేకమైన కంటెంట్ తో నడిచే చిత్రం. నాయకానాయికలు మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తారు. డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. ఎస్.ఎల్.వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి- నందితా దాస్- నవీన్ చంద్ర- జరీనా వహాబ్ – ఈశ్వరి రావు – సాయి చంద్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.