సందీప్ రెడ్డి మౌనానికి అసలు కారణమేమిటో!!

0

What is the real reason for Sandeep Reddy silence

What is the real reason for Sandeep Reddy silence

ఒక్క బ్లాక్ బస్టర్ హిట్టు తీశాడు.. దాంతోనే బాలీవుడ్ లోనూ సత్తా చాటాడు. దాంతోనే బోలెడంత క్రేజు. ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తినా ఎందుకనో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఆరాంగా తదుపరి సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో చెప్పాల్సిన పనే లేదు. ఆయనే సందీప్ రెడ్డి వంగా.

అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసీ ఇంతకాలం అతడు ఎందుకు వెయిట్ చేశాడు? తెలుగులో మరో సినిమా అన్నదే లేకుండా ఎందుకని వెనకబడ్డాడు? అంటే బాలీవుడ్ కి వెళ్లడం ఒక కారణం. అక్కడ అర్జున్ రెడ్డి ని `కబీర్ సింగ్` పేరుతో తెరకెక్కించి సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడు. అయినా ఎందుకనో ఇప్పటి వరకు తన మూడవ చిత్రం గురించి ప్రకటించలేదు.

`కబీర్ సింగ్` నిర్మించిన హిందీ నిర్మాతలకే సందీప్ రెడ్డి మరో కమిట్ మెంట్ ఇచ్చాడని అప్పట్లో ప్రచారమైంది. కానీ ఇంకా ఏ అప్ డేట్ లేదు ఎందుకనో! ఈ చిత్రంలో నటించే హీరో ఎవరు? అనే విషయంపైనా ఇంకా క్లారిటీ రాలేదు. రణబీర్ కపూర్ తో చర్చలు జరిపినా అది వర్కవుట్ అయ్యిందా లేదా? అన్నది కూడా చెప్పనే లేదు. అధికారికంగా ఏదీ ధృవీకరించబడలేదు. ఏడాది ఆరంభంలో సందీప్ రెడ్డి మనసు మార్చుకుని తెలుగు హీరోతో చేయబోతున్నాడనీ ప్రచారమైనా దాని విషయంలోనూ స్పష్ఠత లేదు.

అతడి సందిగ్ధత చూస్తుంటే అభిమానులకు ఎన్నో సందేహాలు. తదుపరి ఏ సినిమా చేయబోతున్నాడు? అది బాలీవుడ్ లోనా.. టాలీవుడ్ లోనా? లేక ఇంకేదైనానా? అన్న ఆసక్తి నెలకొంది. ఇంతకీ హిందీ చిత్రం చేస్తున్నాడా? లేక బహుభాషా చిత్రం ఏదైనా చేస్తున్నాడా? అన్నది తేలాల్సి ఉంది. అసలు సందీప్ మౌనానికి అసలు కారణమేమిటో తేలక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు స్క్రిప్టు లేకనా? హీరోలు దొరక్క పోవడం వల్లనా? అన్నది అతడే చెప్పాలి. అయినా హార్డ్ హిట్టింగ్ హీరోయిజం.. కాస్త అడల్ట్ కంటెంట్ తో హిట్ కొట్టి ఇప్పుడు సందీప్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడా? అన్నది తేలాలి. దేనికైనా అతడు లైన్ లోకొస్తేనే కదా తెలిసేది.