ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో సరికొత్త ఫీచ‌ర్

0

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌’లో తన వినియోగదారుల కోసం త్వ‌ర‌లో ‘డార్క్ మోడ్’ పేరిట ఓ సరికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనుంది. కొన్ని ఎంపిక చేసిన దేశాల్లోని యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్‌ను మొద‌ట అందుబాటులోకి తీసుకురానున్నారు. గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే ఫేస్‌బుక్ ఈ ఫీచ‌ర్ గురించి ప్ర‌క‌ట‌న చేసినప్పటికీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఆ విషయంపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌లేదు. కాగా ప్ర‌స్తుతం ఫేస్‌బుక్ ఈ ఫీచ‌ర్‌ను అంత‌ర్గ‌తంగా ప‌రిశీలిస్తోంది. పూర్తిస్థాయి టెస్టింగ్ తర్వాతే ఈ ఫీచర్‌ను యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెస్తారు.

‘డార్క్ మోడ్’ ప్రయోజనాలివే..
✶ డార్క్ మోడ్’ ఫీచ‌ర్ వ‌ల్ల రాత్రి పూట‌, కాంతి అంత‌గా లేని ప్ర‌దేశాల్లో యూజ‌ర్లు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా చూడ‌వ‌చ్చు.
✶ దీని వల్ల త‌క్కువ కాంతి వెలువడుతుంది. క‌ళ్లు సుర‌క్షితంగా ఉంటాయి.
Please Read Disclaimer