Jio Prima 4G Phone Launch and Price : ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) సరికొత్త బడ్జెట్ ఫోన్ ను విడుదల చేసింది. JioPhone Prima 4G పేరుతో తన కొత్త ఫోన్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫోన్ ను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) 2023లో ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం JioMart వెబ్‌సైట్ అమ్మకానికి తీసుకొచ్చింది. ఇది ఫీచర్ ఫోన్ అయినప్పటికీ.. డిజైన్, ఫీచర్ల విషయంలో రాజీపడలేదు. వివరాల్లోకెళ్తే..
Jio Prima 4G Phone ధర రూ.2599 : ఇక..Jio Phone Prima 4G ఫీచర్ ఫోన్‌ను దీపావళి నాటికి మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ, ముంబై సహా పలు ప్రధాన పట్టణాల్లో ఈ స్మార్ట్ ఫోన్ డెలివరీ చేయనున్నట్లు జియో మార్ట్ తెలిపింది. ఈ సరికొత్త ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ (పసుపు, నీలం)లో అందుబాటులోకి రానుంది. JioPhone Prima 4G Jiomart ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధరను రూ.2599గా కంపెనీ నిర్ణయించింది. లాంచింగ్ సందర్భంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. మరో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు.. OTT సబ్‌స్క్రిప్షన్+ అన్‌లిమిటెడ్ డేటా..
JioPhone Prima 4G స్పెసిఫికేషన్లు ఇవే :
JioPhone Prima 4G ఫోన్ ఒకే SIM స్లాట్ ను కలిగి ఉంటుంది.
JioPhone Prima 4G 2.4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 320×240 రిజల్యూషన్ పిక్సెల్స్ తో అందుబాటులోకి రానుంది.
JioPhone Prima 4G ఫోన్ కు TFT డిస్ ప్లే ఉంది. వెనుక ప్యానెల్ మీద రెండు సర్కిల్స్ ఉన్నాయి. అందులో జియో లోగోను ఉంచారు.
JioPhone Prima 4G ఫోన్‌లో 128GB మైక్రో SD కార్డును పెట్టుకునే అవకాశం ఉంది.
JioPhone Prima 4Gలో ముఖ్య ఫీచర్లు పలు సోషల్ మీడియా యాప్‌లకు సపోర్టు చేస్తోంది.
4G కనెక్షన్ సపోర్ట్, 1800mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.
అలాగే.. JioPhone Prima 4G ఫోన్ 23 భాషలకు మద్దతు ఇవ్వనుంది.
YouTube, JioTV, Jio Cinema, JioSaavn, JioNews లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లకు మద్దతు ఇస్తుంది.
JioPhone Prima 4Gలో WhatsApp, Jiochat, Facebook లాంటి సోషల్ మీడియా యాప్‌లను కూడా ఇందులో పొందవచ్చు.
JioSaavn, JioCinema, JioPay ఫోన్‌లో ముందే లోడ్ చేయబడుతాయి.
ఇక ఈ హ్యాండ్ సెట్ A53 ప్రాసెసర్, KaiOSతో రన్ అవుతుంది.
JioPhone Prima 4G ఫోన్ FM రేడియోతో పాటు 3.5mm ఆడియో జాక్‌కు సపోర్టు చేస్తుంది.
JioPhone Prima 4G ఫోన్‌కు బ్లూటూత్ వెర్షన్ 5.0 మద్దతు ఉంటుంది.
JioPhone Prima 4G ఫోన్ 1,800mAh బ్యాటరీతో రానుంది.
కెమెరా విషయానికి వస్తే 0.3MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
JioPhone Prima 4G ఫోన్ కు సంబంధించి జియో కంపెనీ ఒక ఏడాది వారంటీ అందిస్తోంది.