Vi Recharge Plans: ఆ రీఛార్జ్ ప్లాన్లను సవరించిన వీఐ(Vi).. 6 గంటల పాటు డేటా ఫ్రీ..

0

Vi Recharge Plans: Vi (Vodafone Idea) మరింత మంది వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో రూ. 409 అండ్ రూ. 475 రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను సవరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన వొడాఫోన్ ఐడియా ఇటీవల తన వినియోగదారుల కోసం అదనపు ఆఫర్లతో రీఛార్జ్ ప్యాక్‌లను అప్‌డేట్ చేసింది. ఒక నెల వాలిడిటీతో రూ.409 మరియు రూ.475 ప్యాక్‌లు అదనపు ఆఫర్‌లతో ఈ రీచార్జ్ ప్లాన్ లను సవరించింది. (ప్రతీకాత్మక చిత్రం)

దీని ప్రకారం.. రూ.409 ప్యాక్ 28 రోజుల వ్యాలిడిటీతో ఇప్పటి వరకు రోజుకు 2.5GB ఉచిత డేటాను అందిస్తోంది. ఇప్పుడు దాన్ని 3.5GB డేటాకు పెంచారు. ఇందులో ఇప్పటికే ఉచిత వాయిస్ కాల్, ఎస్ఎంఎస్ తదితర ప్రయోజనాలను అందజేస్తామని ప్రకటించారు.

ఇది’బింగే ఆల్ నైట్’ ప్రయోజనంతో కూడి ఉంటుంది. ఇది రోజువారీ అనుమతించబడిన డేటా కోటా నుండి ఎటువంటి డేటా తగ్గింపులు లేకుండా అర్ధరాత్రి 12 AM నుండి ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి ఎలాంటి డేటా వినియోగం కాకుండా ఈ ప్లాన్ ను సవరించారు.

దీనికి Vi సినిమాలు అండ్ టీవీ యాప్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఉంటుంది. అదేవిధంగా.. రూ.475 ప్యాక్ 28 రోజుల పాటు ప్రతిరోజూ 3GB డేటాను ఉచితంగా అందిస్తోంది. ఇప్పుడు దాన్ని 4 జీబీ డేటాకు పెంచారు. వారాంతపు డేటా రోల్‌ఓవర్, ఉచిత కాలింగ్, మెసేజింగ్ మొదలైన ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

దీనికి Vi సినిమాలు అండ్ టీవీ యాప్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్ కలిగి ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉచిత హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇక.. Vi రూ. 200 లోపు ఫ్లాన్స్ వివరాల్లోకి వెళ్తే.. రూ. 199 ప్లాన్.. ఈ ప్లాన్‌లో మీరు 1GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు.

ఈ ప్లాన్ వాలిడిటీ 18 రోజులు ఉంటుంది. రూ. 155 ప్లాన్.. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 24 రోజులు. అపరిమిత వాయిస్ కాలింగ్ , 300 ఎస్ఎంఎస్ లు, 1GB డేటా అందించబడుతుంది. రూ. 149 ప్లాన్.. అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు మొత్తం 1GB ఇంటర్నెట్ అందించబడుతుంది. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 21 రోజులు ఉంటుంది.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.