Samsung Price Cut : సాంసంగ్ ఇండియా స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గిస్తోంది. ఇప్పటికే గెలాక్సీ ఏ33 (Samsung Galaxy A) మొబైల్ ధర తగ్గింది. మరో మొబైల్ ధరను కూడా తగ్గించింది. ఏకంగా రూ.3,500 ధర తగ్గడం విశేషం.
సాంసంగ్ ఇండియా మార్చిలో గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ (Samsung Galaxy F23 5G) మొబైల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్ ధర రూ.3,500 తగ్గింది. రూ.20,000 లోపు బడ్జెట్‌లో రిలీజైన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.15,000 లోపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ధరకే సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ లిస్ట్ అయింది. (image: Samsung India)
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ మార్చిలో రిలీజ్ అయినప్పుడు 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 4జీబీ+128జీబీ వేరియంట్ రూ.13,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకు లిస్ట్ అయింది. (image: Samsung India)
ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.13,249 ధరకే కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ రూ.2,334 నుంచి ప్రారంభం అవుతుంది. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనేవారికి రూ.12,500 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Samsung India)
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా మరో 6జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. (image: Samsung India)
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ Samsung JN1 ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులో లభించదు. (image: Samsung India)
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్‌లోకనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో వాయిస్ ఫోకస్, ఆటో డేటా స్విచ్చింగ్, పవర్ కూల్ టెక్నాలజీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రెండేళ్ల ఓఎస్ అప్‌డేట్స్, మూడేళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి. ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, కాపర్ బ్లష్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Samsung India)
Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.