సంక్రాంతి బరిలో ఈ సారి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నీ దేనికవే ప్రత్యేకమైనవి. ఒక్కొక్కటి ఒక్కో జోనర్ లో రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ అవుతోంది. అదే రోజు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా లీడ్ రోల్ లో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ హనుమాన్ ప్రేక్షకుల ముందుకి వస్తోంది.
జనవరి 13న విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ రిలీజ్ అవుతోంది. అదే రోజు మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ కూడా థియేటర్స్ లోకి రాబోతోంది. కింగ్ నాగార్జున నా సామి రంగా మూవీ జనవరి 11 లేదా 14 తేదీలలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలలో చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న సినిమాల జాబితాలో గుంటూరు కారం టాప్ ఉంది.
బుక్ మై షోలో అప్ కమింగ్ మూవీస్ పై తీసుకుంటున్న ఆడియన్స్ ఇంట్రస్ట్స్ లో గుంటూరు కారం మూవీ పట్ల 101కె ఆడియన్ ఆసక్తి చూపించారు. దీని తర్వాత రెండో స్థానంలో హనుమాన్ మూవీ 68 కె ఇంట్రస్ట్స్ తో ఉండటం విశేషం. నెక్స్ట్ నా సామి రంగా మూవీని 18.4 కె మంది చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. సైంధవ్ మూవీని 9.8 వేల మంది మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండగా రవితేజ ఈగల్ కి అయితే 8.4వేల మంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్లు ఇంట్రస్ట్స్ పెట్టారు.
గుంటూరు కారం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కాబట్టి ఆటోమేటిక్ గా ఆసక్తి ఉంటుంది. అయితే హనుమాన్ రెండో ప్లేస్ లో ఉండటమే ఇప్పుడు ఇంటరెస్టింగ్ గా మారింది. ఈ మూవీలో హీరో అయినా తేజాతో పోల్చుకుంటే వెంకటేష్, నాగార్జున, రవితేజ టాప్ హీరోలు. కానీ హనుమాన్ అనే పేరుకి ఉన్న వైబ్ ఆడియన్స్ ని సినిమా పట్ల ఆసక్తి పెరగడానికి కారణం అయ్యింది.
ప్రశాంత్ వర్మ కూడా తాజాగా మీడియా సమావేశంలో ఇదే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. మేము చిన్నవాళ్ళం కావచ్చు కానీ మా సినిమా పెద్దది. మా సినిమాలో హీరో హనుమాన్ అందరికంటే పెద్ద స్టార్. అదే మా నమ్మకం. ఆ నమ్మకంతోనే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తున్నామని చెప్పాడు. ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ కి తగ్గట్లుగానే బుక్ మై షోలో సెకండ్ హైయెస్ట్ ఇంటరెస్టింగ్ హనుమాన్ సినిమాకే ఉండటం విశేషం.