Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుక్కు టెన్షన్.. అంతకుమించి..!

సుక్కు టెన్షన్.. అంతకుమించి..!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో పుష్పకి సీక్వెల్ గా ఈ సినిమా సిద్ధం అవుతోంది. 2024 ఆగస్టులో థియేటర్స్ లోకి తీసుకురావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. రష్మిక మందన మూవీలో హీరోయిన్ గా నటించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో కమెడియన్ కేశవ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాడు. పుష్ప మూవీ స్టోరీ కూడా కేశవ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. కథ మొత్తం అతనే నేరేట్ చేస్తాడు. దీంతో కేశవ క్యారెక్టర్ సినిమాలో బాగా పేలింది. స్టార్ యాక్టర్ గా మారిపోయాడు.

ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవడంతో అవకాశాలు నిండుగా వచ్చాయి. అయితే తాజాగా ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో కేశవ ఇరుక్కున్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నేరం ఒప్పుకోవడంతో రిమాండ్ కి తరలించారు. కేశవ అరెస్ట్ కావడం ఇప్పుడు పుష్ప టీంకి పెద్ద తలనొప్పిగా మారింది.

సుకుమార్ పైకి సున్నితంగా కనిపించినా షూటింగ్ టైమ్ లో చాలా టెన్షన్ గా ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ విషయాన్ని పుష్ప 2 సక్సెస్ మీట్ లో కూడా చెప్పాడు. తనకు షూటింగ్ జరుగుతున్నన్నీ రోజులు అసలు ప్రశాంతత ఉండదు అని, సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యి రిలీజ్ అయ్యే వరకు టెన్షన్ తో గందరగోళంగా ఉంటానని అన్నాడు. అలాంటిది ఇప్పుడు కేశవ వ్యవహారం ఆయనకు కోలుకోలేని ఒత్తిడి భారాన్ని మోపింది.

సినిమాలో అతని పాత్రే కీలకం కాబట్టి ఎలా అయిన బెయిల్ మీద తీసుకురావాలని నిర్మాతలు ప్రయత్నం చేశారు. అయితే నేరం ఒప్పుకోవడంతో కేసు మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఇప్పుడు బెయిల్ పొందడం మరింత కష్టం అయ్యింది. ఇలాంటి పరిస్థితిలో అతని క్యారెక్టర్ లేకుండా సినిమా చేయడం ఎలా అనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ పడ్డాడు.

ఇప్పుడు సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉన్నపళంగా క్యారెక్టర్ ని తీసేసిన, కథ నేరేషన్ మార్చేసిన ఇబ్బంది అవుతుంది. అలా అని డూప్ ని తీసుకొచ్చి చేయించే పరిస్థితి ఉండదు. వేరొక ఆర్టిస్ట్ తో కేశవ చేసిన క్యారెక్టర్ ని రీప్లేస్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. సీరియల్స్ లో పాజిబుల్ అయినట్లు సినిమాలలో కుదరదు.

చాలా తక్కువ సందర్భాంలో ఇలా క్యారెక్టర్ లో ఆర్టిస్ట్ రీప్లేస్ చేయడం సాధ్యం అయ్యింది. అలా చేసిన కూడా కంటెంట్ లో మార్పులు చేసి రిప్రజెంట్ చేశారు. మరి పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలో కేశవ చేసిన క్యారెక్టర్ ఇప్పుడు సుకుమార్ కి పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయం చేస్తారనేది వేచి చూడాలి.