ఇటీవలే ఓ స్టార్ హీరోయిన్ కొత్తగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అమ్మడు ఓ బ్యానర్ స్థాపించి నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయింది. అయితే ఆ బ్యానర్ ఏ భాషలో పెడుతుందన్నది క్లారిటీ లేదు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ పాపులర్ అయిన హీరోయిన్. ఈ నేపథ్యంలో మాతృభాషకి మొదటి ప్రాధాన్యత ఇస్తుందా? పర భాషలో పెడుతుందా? అన్న సందేహం తెరపైకి వచ్చింది. అయితే ముందుగా తెలుగులోనే సదరు నిర్మాణ సంస్థను లాంచ్ చేయాలని భావిస్తుందిట.
మాతృభాష కంటే తెలుగులోనే ఎక్కువ పరిచయాలు..తెలిసిన వాళ్లు ఉండటంతో ముందుగానే ఇక్కడి నుంచే ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటుందిట. ఈ నేపథ్యంలో ఆ హీరోయిన్ వెనుక ఓ అగ్ర నిర్మాత ఉన్నాడని వెలుగులోకి వస్తోంది. ఆ నిర్మాత ఇచ్చిన ధైర్యంతోనే నిర్మాణ సంస్థని స్థాపిస్తున్నట్లు తాజా సమాచారం. వాస్తవానికి నిర్మాణ పరంగా ఆ హీరోయిన్ కి ఎలాంటి అనుభవం లేదు.
హీరోయిన్ గా అంటే ఎంతో మంది హీరోలతో పనిచేసింది. రకరకకాల బ్యానర్లలో..నిర్మాతలతో కలిసి ప్రయాణం చేసింది. కానీ నిర్మాణం అంటే అన్ని శాఖలపైనా పట్టు తప్పనిసరి. అందులో ఎక్కడ తేడా వచ్చిన కోట్లలో నష్టాలు చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ నష్టాల నుంచి తనని కాపాడే భరోసా ఓ నిర్మాత ఇచ్చాడుట. ఆ నిర్మాతతో చాలా కాలంగా మంచి స్నేహితురాలిగా మెలగడంతో మీరు మొదలు పెట్టంటి వెనుకుండి అవసరమైన సూచనలు….సలహాలు ఇస్తాను అన్న భరోసా కల్పించారుట.
ఆ ధైర్యంతోనే సదరు హీరోయిన్ నిర్మాణ సంస్థని స్థాపించినట్లు సమాచారం. ముందుగా భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా కంటెంట్ ప్రధానంగా ఉండే సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తుందిట. కథల జడ్జెమెంట్ నుంచి ఏ కథకి ఎంత బడ్జెట్ కేటాయించాలి. దర్శకులు చెప్పే బడ్జెట్ కి…నిర్మాణ సంస్థ కోట్ చేసే బడ్జెట్ మధ్య వ్యత్యాసం వంటివి ఎలా ఉండాలో? వంటి వాటిపై తెలిసిన వారి దగ్గర క్లాస్ లు తీసుకుంటుందిట. మొత్తానికి స్టార్ హీరోయిన్ ఓ ప్రణాళిక ప్రకారమే నిర్మాణ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది.