Templates by BIGtheme NET
Home >> GADGETS >> Xiaomi Smartphone: ఆ స్మార్ట్‌ఫోన్‌ను నిలిపివేయనున్న షావోమీ… కారణమిదే

Xiaomi Smartphone: ఆ స్మార్ట్‌ఫోన్‌ను నిలిపివేయనున్న షావోమీ… కారణమిదే


Xiaomi Smartphone : షావోమీ ఫ్యాన్స్‌కు అలర్ట్. గతేడాది షావోమీ రిలీజ్ చేసిన ఓ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే నిలిపివేయనుందన్న వార్తలొస్తున్నాయి. ఆ స్మార్ట్‌ఫోన్ ఏదో, నిలిపివేయడానికి కారణమేంటో తెలుసుకోండి. షావోమీ గతేడాది ఎంఐ 11 లైట్ (Mi 11 Lite) మొబైల్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో నిలిచిపోనుందన్న వార్తలొస్తున్నాయి. త్వరలో షావోమీ నుంచి ఇండియాలో షావోమీ 12 లైట్ (Xiaomi 12 Lite) లైట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంఐ 11 లైట్ నిలిచిపోనుంది. ఈ ఫోన్ కొనాలంటే ఇంకొన్ని రోజులే అవకాశం.

టిప్‌స్టర్ పరస్ గుగ్లానీ సమాచారం ప్రకారం షావోమీ 12 లైట్ త్వరలోనే ఇండియాకు రాబోతోంది. షావోమీ ఎంఐ 11 లైట్‌ను ఇండియాలో నిలిపివేస్తుందని, ఎంఐ 11 లైట్ ఎన్ఈ 5జీ మోడల్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. అయితే షావోమీ 12 లైట్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. రాబోయే రెండు నెలల్లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కావొచ్చు.

ప్రస్తుతం ఎంఐ 11 లైట్ మొబైల్ అమెజాన్‌లో, షావోమీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.23,999. బ్యాంక్ ఆఫర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనేవారికీ ఆఫర్స్ ఉన్నాయి.

ఎంఐ 11 లైట్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 4,250ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

ఎంఐ 11 లైట్ కెమెరా ఫీచర్స్ చూస్తే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ లెన్స్ + 5 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. జాజ్ బ్లూ, టస్కనీ కోరల్, వినైల్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.

ఇక ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో షావోమీ 12 లైట్ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.31,650 ధరలో, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.35,600 ధరలో, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.39,600 ధరలో రిలీజ్ అయ్యాయి. త్వరలోనే ఈ మొబైల్ ఇండియాలో రిలీజ్ కానుంది.

షావోమీ 12 లైట్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ లభిస్తుంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

షావోమీ 12 లైట్ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 108మెగాపిక్సెల్ Samsung HM2 ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 4300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.