Templates by BIGtheme NET
Home >> Telugu News >> YCP-TDP: అధికార వైసీపీకి ఈసీ బిగ్ షాక్..

YCP-TDP: అధికార వైసీపీకి ఈసీ బిగ్ షాక్..


YCP-TDP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP) ఫుల్ జోష్ తో ఉంది.. ఇటీవల ప్లీనరీకి వచ్చిన స్పందనతో మరింత దూకుడు పెంచాలని భావిస్తోంది.. కచ్చితంగా 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో తమకు వాలంటీర్లు ప్లస్ అవుతారని.. చాలమంది నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఏపీ పాలనాలో ప్రస్తుతం వాలంటీర్లు చాలా కీలంగా మారారు. అన్ని సంక్షేమ పథకాలు (Welfare Schemes).. ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ల (Volunteers)దే కీలక పాత్ర అవుతోంది. వీరిపై అదే స్థాయిలో విమర్శలు ఉన్నాయి.. వీరంతా అధికార పార్టీ కార్యకర్తలకంటే ఎక్కుగా పార్టీకోసం పని చేస్తున్నారని.. విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటు సొంత పార్టీ నేతలు సైతం వాలంటీర్ల తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కీలకంగా మారిన వాలంటీర్లకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

గత ఏడాది కాలంగా ఏపీలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వాలంటీర్లను ఎన్నికల్లో వినియోగించుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. వాలంటీర్లే అధికార పార్టీ ఏజెంట్లుగా పోలింగ్ బూత్ ల్లో వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందాయి.

ఇటీవల వరుస ఫిర్యాదులు అందడంతో ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఏ అభ్యర్థి తరుఫునా పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించవద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, ఎన్నికల రోజున ఓటరు చీటీల పంపిణీ, పోలింగ్‌ ఏర్పాట్లు, పోలింగ్‌ విధులు, ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికలకు సంబంధించిన విధుల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని.. అలా పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ.