Templates by BIGtheme NET
Home >> Cinema News >> Mehreen Pirzada: చేతిలో డ్రింక్ గ్లాస్.. బోటులో షికార్లు కొడుతూ మెహ్రీన్ అందాల విందు

Mehreen Pirzada: చేతిలో డ్రింక్ గ్లాస్.. బోటులో షికార్లు కొడుతూ మెహ్రీన్ అందాల విందు


Mehreen Pirzada Holiday Trip: నటన పరంగా భేష్ అనిపించుకున్న అందాల సోయగం మెహ్రీన్.. కెమెరా ముందు తన గ్లామర్ ఒలకబోయడంలో కూడా సక్సెస్ అయింది. మెహ్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి తెలుగు ప్రేక్షకలోకం ఫిదా అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో మీడియం రేంజ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది మెహ్రీన్. పాలమీగడ లాంటి అందాలతో వెండితెరపై తన మార్క్ చూపెడుతోంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ నిలబెట్టుకునేందుకు ఎంతో హార్డ్ వర్క్ చేస్తోంది. మొదట్లో బాలీవుడ్ చిన్న సినిమాల్లో నటించిన మెహ్రీన్.. అక్కడ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో టాలీవుడ్ వైపు యూ టర్న్ తీసుకుంది. అలా కృష్ణగాడి వీర ప్రేమ కథ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తోంది పంజాబీ బ్యూటీ మెహ్రీన్.

నటన పరంగా భేష్ అనిపించుకున్న ఈ అందాల సోయగం.. కెమెరా ముందు తన గ్లామర్ ఒలకబోయడంలో కూడా సక్సెస్ అయింది. మెహ్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి తెలుగు ప్రేక్షకలోకం ఫిదా అవుతోంది. రాజా ది గ్రేట్ సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న మెహ్రీన్.. ఆ తర్వాత వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ F2 లో కూడా నటించి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దీంతో ఒక్కసారిగా మెహ్రీన్ పాపులారిటీ పెరిగిపోయింది.

ఆ తర్వాత వచ్చిన చాణక్య, ఎంత మంచివాడవురా సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా మెహ్రీన్ కెరీర్ కి మాత్రం ఎంతోకొంత ప్లస్ అయ్యాయి. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమా చేసింది కానీ ఆ సినిమా కూడా సక్సెస్ సాధించలేదు.

ఇక రీసెంట్ గా F3 సినిమాలో నటించి తిరిగి హిట్ ట్రాక్ ఎక్కింది మెహ్రీన్ కౌర్. తమన్నా, వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో F2 సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ భామ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. దీంతో ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ హాలిడే సమయాన్ని పూర్తిగా వాడుకుంటోంది మెహ్రీన్. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులకు గిలిగింతలు పెడుతోంది.

ఈ క్రమంలోనే తన వేకేషన్ పిక్స్ కొన్ని షేర్ చేసింది మెహ్రీన్. ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. బోటుపై షికార్లు కొడుతూ చిల్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో మెహ్రీన్ గ్లామర్ ట్రీట్ ఇవ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్ బ్యూటిఫుల్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. పొట్టి నిక్కర్ లో అందాల జాతర చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం రెమ్మ్యూనరేషన్ పరంగా ఎక్కడా తగ్గడం లేదట. పారితోషికం విషయంలో బాగానే డిమాండ్ చేస్తోందట.