World Cup 2023 : పుట్టిన రోజే.. విరాట్ కోహ్లీ సృష్టించిన చరిత్ర.. !

IND vs SA, World Cup 2023: ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా కోహ్లీ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తద్వారా తన 35వ జన్మదినాన్ని మరింత ప్రత్యేకంగా మలుచుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు సాధించగా.. తాజాగా విరాట్ కోహ్లీ ఈ ఫీట్‌ను సమం చేశాడు.

452 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు బాదగా.. విరాట్ కోహ్లీ 277 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు. యాదృశ్చికం ఏంటంటే కెరీర్‌లో తొలి శతకం బాదిన కోల్‌కతా మైదానంలోనే.. 49వ సెంచరీ సాధించాడు. పైగా 49వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం. అత్యధిక సెంచరీల జాబితాలో కోహ్లీ, సచిన్ తర్వాత రోహిత్(31), రికీ పాంటింగ్(30) ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల‌కు 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(121 బంతుల్లో 10 ఫోర్లతో 101) రికార్డు సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.

విరాట్ కోహ్లీ(121 బంతుల్లో 10 ఫోర్లతో 101) రికార్డు సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Related Images: