జస్ట్.. 13 నిమిషాల్లోనే ఫోన్ బ్యాటరీ ఫుల్!

0

కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు మార్కెట్ వాటా లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తున్నాయి.

వివో తాజాగా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ 120 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది. జూన్ 26 నుంచి షాంఘైలో జరగనున్న ఎండబ్ల్యూసీ సదస్సులో కంపెనీ అధికారికంగా ఈ ఫీచర్‌ను లాంచ్ చేయనుంది.

కంపెనీ చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో పోస్ట్‌లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది. దీని ప్రకారం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 5 నిమిషాల్లోనే సగం ఫుల్ అవుతుంది. ఇక మిగతా సగం చార్జింగ్ 8 నిమిషాల్లో ఎక్కుతుంది. మొత్తంగా బ్యాటరీ ఫుల్ కావడానికి కేవలం 13 నిమిషాలు చాలు.