జగన్ బొమ్మలను చెప్పుల తో కొట్టిన తెలంగాణ విద్యార్థులు [ఫోటోలు]

0

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సభకు తెలంగాణ సెగ తగిలింది. ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితికి చెందిన శ్రీరామ్, ఆటో డ్రైవర్ సతీష్ గౌడ్, సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డిలు వేర్వేరు సమయాల్లో సభా వేదిక ముందు తెలంగాణ నినాదాలు చేశారు. పోలీసులు వారిని బయటకు పంపించారు. నిజాం కళాశాల విద్యార్థులు సమైక్య శంఖారావ సభలోకి వెళ్లే ప్రయత్నాలు చేశారు.

నిజాం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు వైయస్ జగన్ చిత్ర పటాన్ని దగ్ధం చేశారు. జగన్ సభను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సైతం బైక్ ర్యాలీతో ఎల్బీ స్టేడియం వెళ్లేందుకు ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరారు. వారిని పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్నారు. ఇరవ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులు బారికేట్లను తొలగించారు. పోలీసులు విద్యార్థులను వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వారు జగన్ పార్టీ జెండాను దగ్ధం చేశారు.

t-students-opposing-ys-jagan-meeting-01