Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> భార్యభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఈ 8 టిప్స్ పాటించండి..

భార్యభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఈ 8 టిప్స్ పాటించండి..


ఎప్పుడైనా సరే బంధం ఆనందంగా సాగిపోవాలంటే భార్యభర్తలిద్దరూ కూడా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే వారి బంధం బాగుంటుంది. కలకాలం ఆనందమయంగా కొనసాగుతుంటుంది. అసలు ఇంతకు వారిద్దరూ ఏం పాటించాలి. ఎలా ఉండాలనే విషయాల గురించి సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

ఫోన్ పక్కన పెట్టండి..

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ ఫోన్‌కి తెగ అడిక్ట్ అయిపోయారు. ఎంతలా తినడం అయినా పక్కన పెడ్తారేమో కానీ, ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. అయితే, ఈ అలవాటు రిలేషన్ షిప్స్‌పై మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. అందుకే మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్‌ని పక్కనపెట్టడం మరిచిపోవద్దు. ఇంపార్టెంట్ విషయమైతేనే ఫోన్ అటెంప్ట్ చేయండి. లేకపోతే వదిలేయడం మంచిది. లైఫ్ పార్టనర్ ఎదురుగా అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు కచ్చితంగా ఫోన్ పక్కనపెట్టడం అలవాటు చేసుకోండి. దీని వల్ల మీ పార్టనర్‌తో మీరూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పట్నుంచీ మీ పార్టనర్‌తో గడిపే సమయంలో ఫోన్స్‌ని దూరం పెట్టండి.

డేట్‌కి వెళ్లండి..

ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో ఎవరూ ఫ్యామిలీ లైఫ్‌ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ, మీ పార్టనర్‌తో గడిపేందుకు ఒక రోజుని కేటాయించుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుని డెడికేట్ చేయండి. వారితో డేట్‌కి వెళ్లండి. అలా చేయడం వల్ల మీ మధ్య బంధం మరింత బాగుంటుంది. అలా డేట్‌కి వెళ్లాలనుకున్నప్పుడు రెగ్యులర్‌గా కాకుండా కాస్తా కొత్తగా ప్లాన్ చేయండి. మంచి హోటల్‌లో రూమ్‌ బుక్ చేసుకోవడం, సర్ ప్రైజింగ్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోవడం చేేయండి.

అడ్వెంచర్స్..

భార్యభర్తలు అంటే ఎంతసేపు సినిమాలు, షికార్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కలిసి ఇద్దరూ అడ్వెంచర్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఓ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియెన్స్ మీ సొంతం అవుతుంది. తెలియని ప్రాంతాలకు వెళ్లండి.. అక్కడ సాధ్యమైనంత వరకూ సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ పార్టనర్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.

రొమాన్స్‌లోనూ కొత్తదనం..

మీ రిలేషన్ షిప్ బాగుండేందుకు రొమాన్స్ కూడా మంచి హెల్ప్ చేస్తుంది. కాబట్టి, ఈ విషయంలోనూ మీ పార్టనర్‌తో కొత్త కొత్త ప్రయోగాలు చేయండి. ఇలా చేయడంలో మీరు మీ పర్సనల్ టైమ్‌ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడూ రోటీన్‌లా కాకుండా అప్పుడప్పుడు శృంగారాన్ని కొత్తగా ట్రై చేసి మీ పార్టనర్‌తో ఆనంద సమయం గడపండి.

సర్‌ప్రైజెస్ ఇచ్చిపుచ్చుకోండి..

చాలా వరకూ సర్‌ప్రైజెస్ అంటే చాలా మంది ఇష్టపడతారు. అది మన సన్నిహితుల నుంచి అయితే ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది. ఇది లవర్స్, కపుల్స్ మధ్య బాగా పనిచేస్తుంది. కాబట్టి అప్పుడప్పడూ ఒకరికొకరు సర్‌ప్రైజెస్ ఇచ్చుకోవడం చేస్తుండండి. ఇది చాలా మంచి అలవాటు. ఎందుంటే.. తమ సన్నిహితులు తమకోసం ఆలోచించి ఏదైనా చేశారు అన్న ఆనందమే ఎదుటివారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సర్‌ప్రైజెస్ ఇచ్చిపుచ్చుకోండి.

మెచ్చుకోవడం మరవొద్దు..

ఏదైనా గొడవలు తలెత్తినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. అదే ఏదైనా మంచి పని చేస్తే మాత్రం మెచ్చుకోరు. కానీ, ఇలా ఎప్పుడూ చేయకూడదు. పార్టనర్స్ ఎవరైనా సరే ఏదైనా మంచి పనిచేస్తే ఒకరినొకరు మెచ్చుకోవడం మరవొద్దు. ఉదాహారణకి వంట బాగా చేస్తే భార్యని భర్త మెచ్చుకోవడం వల్ల ఆ వంట చేసేందుకు అప్పటివరకూ భార్య పడిన కష్టాన్ని మొత్తం మరిచిపోతుంది. ఇదే భర్త విషయంలోనూ ఏదైనా తను మంచి పని చేస్తే భార్య మెచ్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఓ సానుకూల బంధం ఏర్పడుతుంది.

ఇద్దరు కలిసి సమయం గడపండి…

మీకంటూ కాస్తా సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో ఆనందంగా సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికంటూ ఓ సమయం ఏర్పడుతుంది. ఆ సమయంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిలేషన్ షిప్ అయినా ఆనందమయంగా మారుతుంది.