మీకు వెటకారమెక్కువనా.. ఇది వింటే మరొకరి జోలికెళ్లరు!

0

కొంతమంది మందికి భలే వెటకారం ఎక్కువ. ప్రతిదాన్ని వెటకారం చేస్తుంటారు. ఎదుటివారు ఏమనుకుంటారు అనేది వారికి అనవసరం. ఏది నోటికి వస్తే అది వాగి సెటైర్లు కసి తీరా నవ్వు కుంటూ ఉంటారు. ఎదుటి వారిని తమ మాటలతో హింస పెట్టి వారు మాత్రం పరమానందం పొందుతుంటారు. సందర్భమా కాదా అన్నది కూడా వారు పట్టించుకోరు. ఎదుటి వాళ్ళని తమ వెటకారంతో బాధ పెడుతుంటారు. ఎవరైనా బాధ పడే కొద్దీ వీళ్లు మరింత చెలరేగుతుంటారు. అలాంటి వారు. తస్మాత్ జాగ్రత్త.. వెటకారం ఆడే వారు ఇరిటేట్ చేసేవారు తొందరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

ఎప్పుడూ ఎదుటివాడి అభివృద్ధి చూసి కుళ్లుకునేవాళ్లు ఓర్చు కోలేని వాళ్లు ఏడుపుగొట్టు ముఖాలకు దీర్ఘకాలంలో గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఇలా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువగా స్మోక్ చేస్తారని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారని బాగా లావు అవుతుంటారని సైంటిస్టులు చెబుతున్నారు.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెన్ నేస్సికి చెందిన వైద్య నిపుణులు 2300 మంది హార్ట్ అటాక్ పేషేంట్లను రెండేళ్ల పాటు పరిశీలించారు. వారిలో అధికంగా వెటకారం ఆడటం ప్రతిదానికి నిరాశ పడేవాళ్ళు పక్కన వాళ్ళ గురించి చెడుగా చెప్పే వాళ్లు చిన్న చిన్న విషయాలకు లోలోపల కోప్పడేవారే అధికంగా కనిపించారంట. దీనిని బట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి గుండెకు సంబంధించిన వ్యాధులు అధికంగా వస్తాయని వారి పరిశోధనలో తేలింది.

ఇలాంటి వారి లైఫ్ స్టైల్ ని కొద్ది కొద్దిగా మార్చడం వల్ల ఎదుటి వారి వద్ద తమ దృక్పథాన్ని మార్చడం వల్ల నెమ్మదిగా ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వెటకారం ఎదుటి వారి పట్ల వ్యతిరేక దృక్పథం మార్చుకోవడంతో పాటు మంచి తిండి తీసుకోవాలని.. అప్పుడే గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్మోకింగ్ అలవాటు ఉంటే తగ్గించుకోవడం సరైన వ్యాయామం చేసి లావు తగ్గడం వల్ల కూడా సరైన ఫలితం ఉంటుందని చెబుతున్నారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ కార్డియో వాస్క్యూలర్ నర్సింగ్ లో ఈ స్టడీ పబ్లిష్ అయ్యింది.