ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఎందుకంటే.. ఉల్లిపాయలు కేవలం వంటలో రుచి మాత్రమే కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా తోడ్పడతాయి. అందుకే, ఉల్లికి అంత డిమాండ్. ఉల్లి లేనిదే మన వంటకం పూర్తి కాదు. కొందరు ఉల్లిని వండకుండా పచ్చివే తినేస్తుంటారు. ఆహారంలో నంజుకుని మరీ తింటారు. పచ్చి ఉల్లిపాయలను అలా నేరుగా తినోయొచ్చా? దీని గురించి తెలుసుకొనే ముందు తప్పకుండా ఉల్లి గడ్డ చరిత్రను తెలుసుకోవల్సిందే.ఉల్లి పాయలు కోస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టించినా.. శరీరానికి మాత్రం ఎలాంటి కీడు చేయవు. ఉల్లిగడ్డలను కోసేప్పుడు అందులో నుంచి కొన్ని ఎంజైమ్స్‌తోపాటు ఘాటైన సల్ఫర్ గ్యాస్ విడుదలవుతుంది. అందుకే, వాటిని కోయగానే కళ్ల మంటలు పుడతాయి. ఉల్లి గడ్డలను ఇప్పుడే కాదు.. శతాబ్దాల నుంచి వాడుతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. మన దేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే గడ్డలను వాడుతున్నారట. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఉల్లి గడ్డలను పండిస్తున్నారు.
పచ్చి ఉల్లిపాయలు తినోచ్చా?
ఉల్లిపాయను కూరలో కలపడం వల్ల అదనపు రుచి వస్తుంది. పచ్చివి తిన్నా ఆరోగ్యానికి మంచిదే. పచ్చి ఉల్లిగడ్డలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఎర్రగా ఉండే ఉల్లిపాయలు శరీరంలో మంచి కొవ్వుల ఏర్పాటుకు తోడ్పడతాయి. ఉల్లిలో అధిక మోతాదులో ఉండే సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలు నిద్రలేమిని దూరం చేస్తాయి. క్యాన్సర్‌ను సైతం నిరోధిస్తాయి. ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లి గడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అందుకే వైద్య, ఆరోగ్య సంస్థలు ఔషదాల తయారీలో వీటిని వాడుతున్నాయి. ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతాయి.
ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది, జుట్టుకు మేలు చేస్తుంది:
బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి ఉల్లి గడ్డలు కాపాడతాయి. మనషుల శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నివారించగల యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. పచ్చి ఉల్లిపాయను రోజు తిన్నట్లయితే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పట్టు కుచ్చులా మెరుస్తుంది. మాడుకు రక్త ప్రసరణ పెంచడం వల్ల జుట్టు పెరుగుతుంది.
మధుమేహం, గుండె సమస్యలకు..:
మధుమేహంతో బాధపడే వారు పచ్చి ఉల్లిపాయలను తినం ఎంతో మంచిది. ఉల్లి గడ్డ ఇన్సూలిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రణ ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి, గుండె జబ్బులను దూరం చేయడానికి ఉల్లి మంచి ఔషదం. రక్త నాళాల్లో రక్తం గడ్డకడితే గుండె పోటు ఇతరాత్ర సమస్యలు రావచ్చు. అయితే, ఉల్లి శరీరంలోని రక్తం పల్చగా ఉంచి కణాలు స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదం చేస్తుంది. గుండె జబ్బులు, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది.
మూత్ర సమస్యలకూ మంచి ఔషదం:
మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం వేళలో తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. అందుకే మన మన పెద్దలు ఉదయన్నే పెరుగు, ఉల్లిగడ్డను ఆహారంగా తీసుకొనేవారు. ఉల్లిపాయలు వేసి తయారు చేసే కర్డ్‌బాత్ కూడా ఆరోగ్యానికి మంచిదే. విసర్జన సమయంలో మూత్రంలో మంట, నొప్పి ఏర్పడుతున్నట్లయితే ఉల్లిని తీసుకోండి. కొన్ని ఉల్లి గడ్డలను నీటిలో వేసి బాగా మరిగించి తాగండి. అయితే, 6-7గ్రాములకు మించిన ఉల్లి నీటిని తాగకండి.
సంతాన సమస్యలు, లైంగిక శక్తి కోసం:
ఉల్లి రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఉల్లి విత్తనాలు వీర్యాన్ని పెంచుతాయి. తెల్ల ఉల్లిని పేస్టులా చేసుకుని వెన్నతో కలిపి వేయించండి. తర్వాత కాస్త తేనె కలిపి ఖాళీ కడుపున తాగిగే వయాగ్రాలా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఉల్లి రసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపి తీసుకున్నా లైంగిక శక్తి పెరుగుతుంది. రోజుకు మూడుసార్లు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. ఉల్లి సెక్స్ కోరికలను పెంచడానికే కాదు.. జననేంద్రియాలు సక్రమంగా పనిచేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.
చర్మ సమస్యల కోసం:
చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ఉల్లిని తప్పకుండా తీసుకోండి. ఆలివ్ ఆయిల్, ఉల్లి రసాన్ని సమపాళ్లలో కలపి ముఖానికి పట్టిస్తే.. మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. కాలిన చిన్న చిన్న గాయలను నివారించడానికి కూడా ఉల్లి గడ్డలు ఉపయోగపడతాయి. కాలిన ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని రాసినట్లయితే ఉపశమనం లభిస్తుంది. కాలిన చోటు బొబ్బలు రాకుండా నిరోధిస్తుంది. అలాగే, కాలిన చోట బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఏర్పడే నొప్పిని నివారించేందుకు కాస్త ఉల్లి రసాన్ని రాయండి.
చెవి, దంతాలకూ మంచిదే..:
దంతక్షయ సమస్యలు ఉన్నవారు ఉల్లి గడ్డలను ఎక్కువగా తీసుకోండి. పచ్చి ఉల్లిపాయ ముక్కలను కనీసం 2-3 నిమిషాలు నమలండి. దీనివల్ల నోటిలో ఉండే క్రిములు చనిపోతాయి. పంటి నొప్పి, చిగుళ్ల సమస్య నుంచి కూడా ఉశమనం లభిస్తుంది. చెవి నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని ఉల్లి రసం చుక్కలు వేస్తే ఉపశమనం లభిస్తుంది.
ఆస్త్మా, జాండీస్‌లకూ..:
ఉల్లి గడ్డల్లోని సల్ఫర్ సమ్మేళనాలు ఆస్త్మాకు కారణమయ్యే బయో కెమికల్ చెయిన్ ఫార్మేషన్‌ను నిలిపివేస్తుందని పరిశోధనల్లో తేలింది. దగ్గుతో బాధపడేవారు నోరు ఆరిపోకుండా ఉండేందుకు ఉల్లిని తీసుకోవడం ఉత్తమం. జాండీస్, కామెర్ల నివారణకు కూడా ఉల్లి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. తర్వాతి రోజు ఉదయం చిటికెడు ఉప్పు వేసుకుని తాగినట్లయితే సమస్య దూరమవుతుంది.
ఉల్లి గడ్డల వల్ల కలిగే మరికొన్ని ప్రయోజాలు ఇవీ:
ఉల్లి గడ్డలు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. ❂ ఫైల్స్‌తో బాధపడుతున్నవారు ఉల్లి గడ్డ ముక్కలు, కాస్త పంచదార వేసుకుని తింటే ఉపశమనం లభిస్తుంది. ❂ వేసవిలో వేడి చేస్తే ఉల్లి గుజ్జును పాదాలకు, మెడకు పూస్తే చలవ చేస్తుంది. ❂ గ్యాస్ట్రో సిండ్రోమ్ సమస్యలతో బాధపడేవారు ఉల్లి గడ్డలతను తింటే ఉపశమనం లభిస్తుంది. ❂ ఉల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ వల్ల కడుపు నొప్పిని దూరం చేస్తాయి. ❂ ఉల్లిలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్ధరైటిస్ నొప్పిని నివారిస్తాయి. ❂ రక్తహీనతో బాధపడేవారు పటికీ బెల్లం నీటితో ఉల్లిపాయలను కలిపి తీసుకుంటే మంచిది. ❂ ఉల్లి పాయలు రక్తంలోని కొవ్వులను తొలగిస్తాయి.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
