వేవిళ్ళకు లవంగాల పొడితో చెక్ పెట్టండి

0

vomitings-tipsలవంగాన్ని చప్పరించటం వల్ల నోరు తాజాగా ఉంటుంది. లవంగాల పొడికి కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూను తేనెని కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. లవంగాల్ని మెత్తగా పొడి చేసి అందులో దాసించెక్క ఆయిల్ కలిపి తలపై ఎక్కడయితే నొప్పిగా అనిపిస్తుందో అక్కడ పూయాలి. లావు కావాలనుకున్నవారు మధ్యహ్నం భోజనంలో గంజి వేసుకొని తింటుంటే ఫలితం ఉంటుంది.

ఇకపోతే.. లావుగా ఉన్నవారు సన్నబడాలంటే ప్రతి నిత్యం లేతములగాకు (ములగచిగుళ్ళు) రసం తాగుతూ ఉండాలి. వయసు పెరిగే కొద్దీ ఆయాసం, నీరసం, బడలిక వంటి సమస్యలు వస్తుంటాయి.

అవి తగ్గాలంటే రోజూ ఉదయాన్నే పరగడుపున ఒకసారి, మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒకసారి ఒక గ్లాసు నీటిలో అర టేబుల్‌ స్పూను తేనె, చిటికెడు దాల్చినచెక్క పొడి కలిపి తీసుకుంటే ఒక వారం రొజుల్లోనే ఫలితం ఉంటుంది.