Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> కొబ్బరి నూనెతో శృంగార సామర్థ్యం పెరుగుతుందా?

కొబ్బరి నూనెతో శృంగార సామర్థ్యం పెరుగుతుందా?


కొబ్బరి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు.. కొబ్బరి నీళ్లు శరీరానికి చాలా మంచివి. నూనెకు తల రాసుకుంటే ఆరోగ్యం. ఇక వంటల్లోనూ కొబ్బరినూనెను వాడుతారు. ఇక శృంగారాన్ని కూడా రసభరితంగా మార్చే శక్తి కొబ్బరినూనెకు ఉందని తేలింది.

కొబ్బరి నూనె పురుషుల్లో టెస్టోస్టెరాన్ మహిళల్లో ప్రొజెస్టిరినో హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కొబ్బరి నూనె వల్ల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి మెరుగవుతుంది. ఫలితంగా సెక్స్ లో మరింత ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. కొబ్బరి నూనెను డైట్ లో భాగం చేసుకుంటే మంచి శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక తాజాగా అధ్యయనం ప్రకారం.. కొబ్బరినూనె మాయిశ్చరైజర్ అని.. అంగ ప్రవేశానికి కందెనగా వాడవచ్చని తేలింది. దీని వల్ల మరింత ఎక్కువ సేపు శృంగారం చేయడం సాధ్యమవుతుందని వెల్లడైంది.

మర్మంగాలు పొడబారే సమస్యను ఎదుర్కొనే వారు కొబ్బరి నూనె ద్వారా ఉపశమనం పొందవచ్చు. స్త్రీల జననాంగం స్రావాలు ఊరేలా చేసి శృంగారాన్ని మజాగా చేయడంలో కొబ్బరినూనె బాగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

కొబ్బరి నూనెను వంటల్లో వాడటం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనె శరీర బరువును తగ్గించటంలో శక్తివంతంగా పనిచేస్తుందని ఇటీవల పరిశోధనల్లో తేలింది. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సీటీ పరిశోధకులు పరిశోధన గ్రంధం విడుదల చేశారు.

*కొబ్బరినూనెలో ట్రైగ్లిసరైడ్లు జీవక్రియను పెంచి శక్తి వినియోగాన్ని రెట్టింపు చేస్తాయి. కావున బరువు తగ్గించుకోవాలనుకునే తీసుకునే ఆహార పదార్థాల్లో కొబ్బరినూనెను వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

*తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో కొబ్బరినూనె వాడకం అధికమైందని తేలింది. గత ఏడాదితో పోల్చితో కొబ్బరినూనె వాడకం పెరిగిందని.. పది మందిలో ఏడుగురు కొబ్బరి నూనె ఆరోగ్యకరమని నమ్ముతున్నట్లు తేలింది.

* కొబ్బరి నూనెలోని చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బరువును తగ్గిస్తాయని వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.