గోధుమ రవ్వ రోజు తినడానికి 4 కారణాలు

0

ఉరుకులు పరుగుల ఈ ప్రస్తుత తరుణం లో ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం. కాని మనం తినే ఆహారం లో అన్ని పోషక విలువలు ఉండవు, ముఖ్యంగా ప్రోటీన్స్. హోల్ గ్రేయిన్లు వీటిలోని పోషకాలతో సరైన ఆహారాలు అవుతాయి. అలాంటిదే దలియ. దలియ వలన కలిగే ప్రయోజనాలను పరిశిలిద్దాం.
1ప్రోటీనులకు ప్రసిద్ది
దలియ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం. దిన్ని ఎ వేలలోనైన తీసుకోవచ్చు, అల్పాహారంగా , లంచ్ లో లేదా డిన్నర్ లో ఎ వేలలోనైన. దీనితో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల్ కూడా లభిస్తాయి.

2బరువు నియంత్రణ
దలియ లో ఫైబర్ లు కూడా అధికంగా ఉంటాయి, ఇవి ఎక్కువ సేపు కడుపు ఫుల్ గ ఉన్న భావన ను కలిగిస్తాయి, దీనితో తినాలనే కార్వింగ్ ను అదుపులో ఉంచుతాయి. తద్వారా, జంక్ ఫుడ్ తినడానికి దూరంగా ఉండవచ్చు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ గ దీన్ని తీసుకోవడం తో రోజంత ఆక్టివ్ ఉండడమే కాదు, అవసరమైన న్యూట్రిషన్ల్ కూడా లభిస్తాయి.

3బ్లడ్ షుగర్ ను నియంత్రణ
షుగర్ ఉన్నవారికి ఇది సరైన ఆహారం. దీంట్లోని తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ మరియు కాంప్లెక్స్ కార్బ్స్ శరీరం లోకి గ్లూకోస్ ను నియంత్రణను క్రమబద్దికరిస్తాయి. దీనితో షుగర్ లెవెల్స్ నియంత్రించడం సులువు అవుతుంది.

4మెటబాలిజం పెరుగుదల
రోజు దలియ తినడం వలన శరీర సామర్థ్యం పెరిగి మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. అంతేకాక, ఇది మలబద్దకాన్ని కూడా నిర్మూలించడం లో ఎంతగానో దోహద పడుతుంది. దీనిలోని హై ఫైబర్ మరియు ప్రోటీన్స్ దలియను సూపర్ ఫుడ్ గ చేస్తాయి.
Please Read Disclaimer