పెళ్లైన ఏడేళ్ల తర్వాత భర్త నుంచి ప్రియుడి దగ్గరకు..

0

కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ మూవీ హమ్ దిల్ దే చుకే సనమ్ పేరుతో వచ్చిన సినిమా గుర్తుందా? అజయ్ దేవగణ్.. ఐశ్వర్యారాయ్.. సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం అప్పట్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు సంచలన విజయాన్ని సాధించింది. కాకుంటే.. ఆ మూవీ క్లైమాక్స్ ను మినహాయించి సేమ్ టు సేమ్ అన్నట్లుగా రియల్ ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది.

భోపాల్ కు చెందిన అనిల్ (పేరు మార్చాం)కు ఐశ్వర్య (పేరు మార్చాం) ఏడేళ్ల క్రితం వివామహైంది. వారికిప్పుడు ఇద్దరు పిల్లలు. అనిల్ ఐటీ ఉద్యోగి అయితే.. ఐశ్వర్య ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. సలక్షణంగా సాగిపోతున్న వారి కాపురం కాస్తా కోర్టుకు ఎక్కింది. తనకు విడాకులు కావాలని ఐశ్వర్య కోరుకుంది. కారణం.. ఏడేళ్ల క్రితం తన ప్రేమ.. తిరిగి ఇప్పుడు ప్రియుడి రూపంలో రావటంతో ఆమె అనిల్ తో దాంపత్య జీవితానికి పుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యారు.

పెళ్లికి ముందు ప్రేమలో ఉండటం.. పేరెంట్స్ బలవంతంతో పెళ్లికి ఒప్పుకోవటం ఒక ఎత్తుఅయితే.. ఇటీవల తన ప్రేమికుడు ఆమెను కలిశాడు. ప్రేమ ఫెయిల్ అయినా పెళ్లి చేసుకోకుండా ఆమె గురుతులతో ఉండిపోయాడు. దీంతో.. ఆమె అతడి వద్దకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీనికి అనిల్ మొదట్లో ఒప్పుకోకున్నా.. ఆమె మనసులో తన మాజీ ప్రియుడే ఉన్నాడన్న విషయం అర్థమయ్యాక విడాకులకు ఓకే అన్నాడు.

కాకుంటే ఇద్దరు పిల్లల బాధ్యత తానే తీసుకుంటానని.. ఆమెకు ఎప్పుడైనా పిల్లల్ని చూడాలనిపిస్తే వచ్చి చూడొచ్చని చెప్పాడు. దీనికి ఐశ్వర్య కూడా ఓకే చెప్పింది. ఉభయులు అంగీకారంతో విడాకులు కోరుకోవటంతో ఫ్యామిలీ కోర్టు త్వరలో వీరికి విడాకులు మంజూరు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ అంతా చూసినప్పుడు మదిలో మెదిలేది ఇద్దరు..ఒకరు భర్త.. మరొకరు ఇద్దరు పిల్లలు. ఐశ్వర్య ప్రేమ ఎపిసోడ్ ఏ మాత్రం తెలీకుండా.. దాని కారణంగా వారిప్పుడు బాధితులుగా మారటం చూసినప్పుడు అయ్యో అనిపించకమానదు.