థైరాయిడ్ ఉంటే శృంగారంపై ఆసక్తి తగ్గుతుందా..

0

ఉన్న ఒకే ఒక లైఫ్‌లో ప్రతి విషయాన్ని అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. ప్రతి విషయాన్ని ఆస్వాదించాలి. ఈ నేపథ్యంలోనే శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. కానీ, నేటి కాలంలో ఎవరూ కూడా అంతగా దానిపై ఆసక్తి చూపటడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కోరికలు తగ్గడం కూడా అని చెబుతున్నారు చాలా మంది. మరి కోరికలు ఎందుకు తగ్గుతాయి… ఆసక్తి ఎందుకు ఉండడం లేదు. ఈ సమస్యకి పరిష్కారాలు ఏంటి.. ఇప్పుడు చూద్దాం..

​శృంగారం చేయకపోతే..

మానవ శరీరానికి శృంగారం చాలా ముఖ్యం. ఇది లేకపోవడం వల్ల శరీరంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. డ్రైగా మారడం, ఆరోగ్య సమస్యలు, నిద్రలేమీ, జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే తరచూ శృంగారంలో పాల్గొనాలని చెబుతున్నారు నిపుణులు..

​బిజీ కారణం కావొచ్చు..

నేటి జీవితంలో అందరూ కూడా ఫుల్ బిజీ అయిపోయారు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కారణంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఎక్కువ సమయం ఉండడం లేదు. సమయానికి భోజనం, నిద్ర ఇలాంటివే ఉండడం లేదు.. దీంతో మరి ఆ కార్యాన్ని ఎలా ఆస్వాదిస్తారు. అందుకే దానిపై అంతగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు చాలా మంది. కానీ, ఇది ఎంతవరకు కూడా మంచిది కాదని చెబుతున్నారు. ఈ సమస్యకి ఫుల్‌స్టాప్ పెట్టకపోతే భవిష్యత్‌లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

​డిప్రెషన్..

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా దంపతులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. దీని వల్ల ఆ ఒత్తిడితోనే సతమతమవుతున్నారు. దీని వల్ల శరీరంలో కార్టిసాల్ మొత్తాన్ని పెంచుతుంది. బాడీలో కార్టిసాల్ ఎక్కువగా ఉంటే.. టెస్టోస్టెరాన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ కారణంగా సెక్స్ చేయాలనే కోరికలు తగ్గిపోతాయని చెబుతున్నారు నిపుణులు.

​ఆటిజం..

శరీరంలో కోరికలను తగ్గించడంలో ఆటిజం అనేది కూడా ముఖ్య కారణంగా ఉంటంది. దీని వల్ల మానసిక, శారీరక కోరికలు తగ్గిస్తాయి. అందుకే ముందుగా ఈ సమస్యని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం యాంటీ ఆటిజం మెడిసిన్ తీసుకోవాలి. లేకపోతే శరీరంలో కోరికలు మొత్తం తగ్గిపోతాయి. ఇది భవిష్యత్‌లో శృంగారంపై ఆసక్తినే పూర్తిగా హరించేస్తుంది. అలా కాకుండా జాగ్రత్తలు పాటించాలి.

​థైరాయిడ్ ఉంటే..

కొన్ని పరిశోధనల ప్రకారం, థైరాయిడ్ సమస్యలు ఉన్నా ఆ ప్రభావం లైంగిక జీవనంపై పడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో హైపో థైరాయిడిజం జీవక్రియకు అంతరాయాన్ని కలిగిస్తుంది. దీంతో.. సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే థైరాయిడ్‌కి ముందు ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడం, లైంగిక శక్తిని థైరాయిడ్ తగ్గిస్తుంది.

​ఇవి కూడా కారణాలే..

సరైన ఆహారం లేకపోవడం, సరైన జీవన విధానం లేకపోవడం, నిద్రలేమి, వ్యాయామం చేయకపపోవడం కూడా కోరికలను తగ్గిస్తుంది. కాబట్టి ముందుగా వీటికి చికిత్స చేసుకోండి. ఇలా చేయడం వల్ల కోరికలు ఉంటాయి.. సరైన జీవన విధానంతోనే చక్కని లైఫ్ ఉంటుంది. ఉంటుంది. ముందుగా అన్ని సమస్యలను పరిష్కరించుకోండి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-