Vastu Dosha: గృహ నిర్మాణానికి వాస్తు ఉండాల్సిందే. లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో వాస్తు ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోది. ముహూర్తం చూసుకుని వాస్తు ఎంచుకుని మరీ పనులు చేస్తున్నారు. దీంతో గృహ నిర్మాణాల్లో అధునాతన పద్ధతులు వస్తున్నాయి. దీంతో రోజురోజుకు వాస్తులో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముగ్గు నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని స్థాయిల్లో వాస్తును ప్రధానంగా తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణంలో ప్రతి విషయం వాస్తుతోనే ముడిపడి ఉంటోంది.
ఇంటికి ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దక్షిణం వైపు తక్కువ ఖాళీ స్థలం ఉండాలి. ఇలా కాదంటే దక్షిణం వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే అరిష్టమే. అనర్థాలు వస్తాయి. దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే దారిద్ర్యం, ఆస్తులకు నష్టం, స్త్రీలకు అనారోగ్యం, కోర్టు కేసులు, పిల్లలకు అనారోగ్యాలు లాంటివి బాధిస్తాయి. దీంతో ఉత్తరం కంటే ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం వైపు ఖాళీ స్థలం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే వాస్తు దోషం పట్టి పీడిస్తుంది. తద్వారా మనకు నష్టాలే మిగులుతాయి.
తూర్పు కంటే పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండకూడదు. ఎప్పుడైనా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు తూర్పులోనే ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. లేదంటే మనకు నష్టాలే వస్తాయి. దీంతో ప్రాణనష్టం, పరువు నష్టం, సంతాన నష్టం, అనారోగ్యాలు బాధిస్తాయి. ఎప్పుడు కూడా తూర్పు కంటే పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం వదిలితే ఎన్నో అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇల్లు కట్లుకునేటప్పుడే అన్ని చూసుకోవాలి.
తూర్పు, ఉత్తర దిశలను తీసుకుంటే ఎటు వైపు ఎక్కువ స్థలం ఉండాలని అనుకుంటే ఉత్తరం వైపు ఎక్కువ స్థలం ఉండాలని చెబుతున్నారు. ఉత్తరం కంటే తూర్పున ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నా నష్టమేమీ ఉండదని తెలిసినా ఖాళీ స్థలం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది. లేదంటే దాని ఫలితాలతో మనం బాధ పడాల్సి వస్తోంది. ఉత్తరం కంటే పడమరలో ఎక్కువ ఖాళీ స్లలం ఉండకూడదు. పడమర కంటే ఉత్తరంలోనే ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. ఉత్తరం కంటే పడమరలో ఖాళీ స్థలం ఎక్కువుంటే ఫలితం లేని శ్రమ, అనారోగ్యాలు, ఆపరేషన్లు, దురలవాట్లు తదితర నష్టాలు ఉంటాయని తెలుస్తోంది.
Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.