గర్భం త్వరగా రావాలంటే ఇలా చేయాల్సిందే..!

0

నేటి బిజీ లైఫ్‌లో అందరి లైఫ్‌స్టైల్ ఊహించనంతగా మారిపోయింది. తీరిక లేకపోవడంతో వ్యాయామానికి దూరంగా ఉండటం, ఆహారంపై నియంత్రణ లేకపోవడంతో అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇది పురుషుల కంటే స్త్రీలపై ముఖ్యంగా వారి ప్రత్యుత్పతి వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. గర్భం పొందాలనుకునే మహిళలు తమ జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లను కచ్చితంగా మార్చుకోవాల్సిందే. త్వరగా గర్భం పొందాలనుకొనే వారు ముందుగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాలి. దీనికి తోడు కొన్ని ఆహార పదార్థాలను రెగ్యులర్ డైట్‌లో చేరిస్తే వీలైనంత త్వరగా గర్భం దాల్చే అవకాశాలుంటాయి. అవేంటో తెలుసుకుందామా..

ఆకుపచ్చని కూరగాయలు: ఆకుపచ్చని కూరగాయల్లో ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎండోమెట్రియల్ లైనింగ్ ఏర్పడుతుంది. అండం ఈ పొరకు అంటుకునేలా ఐరన్ సాయపడుతుంది. దీంతో గర్భధారణకు అవకాశం పెరుగుతుంది.

బ్రొకోలి: గర్బం ధరించాలనుకునే మహిళలకు బ్రొకోలి మంచి ఆహారం. దీనిలో ఫోలిక్ యాసిడ్‌తో పాటు అత్యధిక పోషకాలుండటం వల్ల గర్భం ధరించేవారికి పుష్కలమైన ఆహారమని గైనకాలజిస్టులు సిఫార్సు చేస్తుంటారు.

బంగాళదుంపలు: గర్భం ధరించాలనుకునేవారు బంగాళాదుంపలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ బి, ఇ.. కణాల ఉత్పత్తిని పెంచి ఆరోగ్యకరమైన ఓవమ్‌ పెరగడానికి సాయపడుతుంది. పురుషుడి వీర్యకణంతో మహిళలోని అండం ఫలదీకరణం చెందిన తర్వాత మొదట ఏర్పడేదే పిండం. తొలిదశలో ఇది ఒకే కణంగా ఉంటుంది. దీన్నే ‘ఫెర్టిలైజ్‌డ్ ఓవమ్’ అంటారు.

దానిమ్మ: దానిమ్మ పండ్లకి స్త్రీ, పురుషుల్లో సెక్స్ హార్మోనులను పెంచే శక్తి ఉంది. దానిమ్మ రసం తాగిన స్త్రీ, పురుషులిద్దరిలోనూ టెస్టోస్టిరాన్ స్థాయిలు పుంజుకోవడంతో పాటు రక్తపోటు తగ్గుతుంది. దీంతో ఇద్దరికీ సెక్స్ పట్ల ఆసక్తిని కలిగిస్తుంది.

అరటి పండ్లు: రుతు సమస్యలు ఉన్న స్త్రీలు గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటివారు విటమిన్ బి6 అధికంగా ఉంటే అరటిపండ్లు ఎక్కువగా తినాలి. ఇది తినడం వల్ల రుతుక్రమ సమస్యలు తగ్గి గర్భధారణకు మార్గం సుగమం అవుతుంది.
Please Read Disclaimer