Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> నా గర్ల్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్‌తో … చేశా, ఇప్పుడేం చేయాలి?

నా గర్ల్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్‌తో … చేశా, ఇప్పుడేం చేయాలి?


ప్రశ్న: నేను ఎనిమిదేళ్లుగా ఒక అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. కానీ ఆమెతో మానసికంగా పెద్దగా కనెక్ట్ కాలేకపోయాను. కొద్ది నెలల నుంచి తన బెస్ట్ ఫ్రెండ్‌తో మాట్లాడటం మొదలుపెట్టాను. మేమిద్దం ఒకరి పట్ల మరొకరం ఆకర్షణకు లోనయ్యాం. వేరే ఫ్రెండ్స్‌తోపాటు మేం తరచుగా చిట్ చాట్ చేసేవాళ్లం. కానీ గత వారం మేమిద్దరం మాత్రమే బయటకు వెళ్లాం. ఆ టైంలో మేమిద్దరం శారీరకంగా ఒక్కటయ్యాం. అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు సిగ్గుగా ఉంది. పెద్ద తప్పు చేశాననే భావన వేధిస్తోంది. ఈ విషయాన్ని నా గర్ల్ ఫ్రెండ్‌కు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మా ఇద్దరి విషయం తనకు తెలిస్తే.. తను నాకు దూరమవుతుందేమోనని భయంగా ఉంది. ఆ తప్పిదం గురించి తనతో చెప్పాలా? వద్దా? సలహా ఇవ్వగలరు. – వివరాలు వెల్లడించలేదు. 

సమాధానం: లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదురవుతాయి. మీరు మీ గర్ల్‌ఫ్రెండ్‌ను చీట్ చేశారు, ఆ విషయమై ఎంతో బాధపడుతున్నారు. ఈ విషయంలో ఇది తప్పు లేదా ఒప్పు అని ఎవరూ చెప్పలేరు. మీరేంటనే విషయం మీరే చెప్పాలి. మీ గర్ల్‌ఫ్రెండ్ పట్ల మీరెంత కమిట్‌మెంట్‌తో ఉన్నారనే విషయం మీకు మాత్రమే తెలుసు. 

మీరు తన ఫ్రెండ్‌తో శారీరకంగా కలిసిన విషయం చెబితే.. తను రియాక్ట్ అవుతుంది. తర్వాతి పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెప్పకపోతే అపరాధ భావన మిమ్మల్ని వేధిస్తుంది. తనంతట తానుగా ఈ విషయం తెలుసుకుంటే పరిస్థితి ఏంటనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఏ రకంగా చూసినా మీకు ఇబ్బందికర పరిస్థితే. ఏరకమైన పరిస్థితి మీకు కంఫర్ట్‌గా ఉందనే విషయమై మీరే మానసికంగా సంసిద్ధం కండి. 

మీరు 8 ఏళ్లుగా గర్ల్ ఫ్రెండ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటున్నప్పటికీ.. తనతో ఏ విధమైన కనెక్షన్ ఉన్న ఫీలింగ్ లేదంటున్నారు. కొంత సమయం తీసుకొని మీరేం కోరుకుంటున్నారో ఆలోచించుకోండి. రిలేషన్‌షిప్‌లో అనేక దశలను దాటాల్సి ఉంటుందని అర్థం చేసుకోండి. ఇంకా కన్ఫూజన్‌గా ఉంటే.. కౌన్సెలింగ్ తీసుకోండి. 

సమాధానం ఇచ్చినవారు: రచనా అవతారమణి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, ఇన్‌సైట్ కౌన్సెలింగ్ సర్వీసెస్, ముంబై.