పురుషులకు పొడవైన జుట్టుకు చిట్కాలు

0

అందరిని ఆకర్షించటానికి మరియు స్టైల్’గా కనపడటానికి శరీరంలో మొదటగా గుర్తెచ్చేది వెంట్రుకలే. అవునా! ప్రతి ఒక్కరు వారి జుట్టును ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిల గురించి చెప్పవలసిన అవసరం లేదు, పొడవు జుట్టు కలిగి ఉండటానికి స్త్రీలు ఇష్టపడుతుంటారు అవునా! కానీ పురుషులలో చాలా తక్కువ మంది పొడవైన జుట్టును కలిగి ఉంటారు, అంతేకాకుండా ఇతరులతో పోలిస్తే, పొడవు జుట్టు కలిగి ఉన్న పురుషులు అమ్మాయిలను మరియు చుట్టూ ఉండే వారిని ఆకర్షిస్తుంటారు. కానీ మగవారు ఎక్కువ సహనాన్ని కలిగి ఉండరు కావున పొడవు జుట్టు నిర్వహణ పైన ఎక్కువ శ్రద్ధ చూపరు.

పురుషులలో పొడవైన జుట్టు నిర్వహణ అంత సులభమైన పని కాదు. పొడవైన జుట్టు కలిగి ఉండి, మధ్యలో గాలి వీస్తూ, చూడటానికి అందంగా కనపడుతుంటారు. ఇలా అందంగా కనపడటానికి మరియు పొడవైన జుట్టు నిర్వహణ చాలా కష్టమే. కానీ ఇక్కడ తెలిపిన చిట్కాలను అనుసరించటం వలన పొడవైన జుట్టును పొంది సరైన విధంగా నిర్వహించవచ్చు.

సరైన కండిషనింగ్
ప్రతిసారి జుట్టును కడిగిన తరువాత, ఎండే వరకు వేచి ఉండండి. షాంపూ వాడిన ప్రతి సారి మంచి కండిషనర్’లను వాడండి మరియు వెంట్రుకలను సరైన విధంగా ఆరనివ్వండి. కానీ మీరు వాడే షాంపూ మరియు కండిషనర్’ల ఎంపికలో సరైన జాగ్రత్తలను పాటించండి. మీ కేశాల రకాన్ని, స్థితిని తెలుసుకొని ప్రోటీన్’లను మరియు పోషకాలను అందించే ఉత్పత్తులను ఎంపిక చేసుకోండి ఈ ఎంపిక కూడా వెంట్రుకలలో కలిగే ప్రమాదాలను తగ్గించేవిగా ఉండాలి. అధిక మొత్తంలో ప్రోటీన్’లను అందించే కండిషనర్’ల వాడకం వలన జుట్టు పెలుసుళుగా మారే అవకాశం ఉంది. కావున మీ జుట్టుకు తగిన ఎంపిక తప్పని సరి. వారానికి ఒకసారైన సహజ కండిషనర్’లచే కడగటం మంచిది.

ప్రత్యామ్నాయాలు
మీ జుట్టును వేడి నీటితో కడగండి. ఒకవేళ చల్లటి నీరు అందుబాటులో లేకున్నను, వేడి నీటితో మాత్రం జుట్టును కడగకండి. కనీసం సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీటితో, సరైన షాంపూను వాడి జుట్టును కడగండి. వేసవికాలంలో తలపై చర్మం వేడికి బహిర్గతం అవటం వలన ఎక్కువ మొత్తంలో చెమట ఉత్పత్తి చెంది, చుండ్రు కలిగే అవకాశం ఉంది. వేసవి కాలంలో మాత్రం జుట్టును కడగండి. రోజు జుట్టును కడగటం కన్నా సహజ నూనెలతో మసాజ్ చేయటం వలన పొడవైన జుట్టు, ఆరోగ్యకరంగా ఉంటుంది. సహజ నూనెలతో మాసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ జరిగి, జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జుట్టు పొడవుగా, ఆరోగ్యకరంగా ఉండటానికి కావాల్సిన పోషకాలను అనగా విటమిన్’లు, ఐరన్ మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్’లను సరైన స్థాయిలో అందించండి. ఆరోగ్యకరమైన ఆహరం, తాజా పండ్లు మరియు కూరగాయలను తినండి. వీటి వలన జుట్టు కావలసిన పోషకాలు అందించ బడతాయి. జుట్టు పొడవుగా పెరుగుటకు ముందుగా, కేశాలను ప్రమాదానికి గురి చేసే ఆహర పదార్థాలను తినకండి. స్నానం చేసిన వెంటనే, సహజ ఫైబర్’లతో తయారుచేసిన దువ్వెనలు వాడండి. దువ్వెనతో ఎక్కువ ఒత్తిడితో దూయకుండా, నెమ్మదిగా దూయండి. ఎక్కువ ఒత్తిడితో దూయటం వలన వెంట్రుకల మొదల్లలో సమస్యలు తలెత్తి, జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. మీ తలపై చర్మ ఆరోగ్యం కోసం యూకలిఫ్టస్, మెంతాల్ లేదా మిరియలా (పిప్పరమెంట్) గుణాలను కలిగి ఉన్న నూనెలను వాడండి.

చివరిగా..

  • పొడవైన జుట్టు మరియు దానిని నిర్వహించటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పొడవైన జుట్టు నిర్వహణ కోసం సరైన స్థాయిలో పోషకాలను అందించాలి.
  • మీ జుట్టు రకాన్ని బట్టి, వాడే ఉత్పత్తులను ఎంచుకోండి.
  • జుట్టు ప్రమాదానికి గురవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

పైన తెలిపిన సూచనలు అనుసరించటం వలన పురుషులు కూడా పొడవైన జుట్టును సమర్థవంతంగా నిర్వహించగలరు.