Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> స్త్రీలలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణాలివే..

స్త్రీలలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణాలివే..


పడక గదిలో దంపతులిద్దరూ ఉత్సాహంగా కలయికలో పాల్గొంటేనే శృంగారాన్ని ఆస్వాదించడం సాధ్యం అవుతుంది. ఇద్దరి ఏ ఒక్కరూ నిరాసక్తత కనబర్చినా రెండో వ్యక్తిలో ఉత్సాహం తగ్గిపోతుంది. సాధారణంగా పురుషులు సెక్స్ కోసం చొరవ తీసుకుంటారు. మహిళలు మొదట్లో ఆసక్తి కనబర్చకపోయినా.. ఫోర్ ఫ్లే తర్వాత రతి క్రీడను ఆస్వాదిస్తారు. ముద్దులు, కౌగిలింతల తర్వాత మెల్లగా భాగస్వామికి సహకరిస్తారు. కానీ కొన్ని రకాల సమస్యల కారణంగా ఆడవారిలో లైంగిక వాంఛలు తగ్గిపోతాయి. సెక్స్ పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. అవేంటో చూద్దాం..

కలయిక సమయంలో తీవ్రమైన నొప్పి ఉండటం, భావప్రాప్తి పొందలేక పోవడం లాంటి కారణాలతో మహిళల్లో లైంగిక వాంఛలు, సెక్స్ పట్ల ఆసక్తి సన్నగిల్లుతాయి.

ఆర్థరైటిస్, కేన్సర్, డయాబెటిస్, హైబీపీ, నరాల సంబంధిత సమస్యలు మొదలైనవి మహిళల్లో లైంగిక వాంఛలను తగ్గిస్తాయి. వంధ్యత్వం కూడా సెక్స్ కోరికలు తగ్గడానికి కారణం అవుతుంది. దీనికి చికిత్స తీసుకున్నా లైంగిక కోరికలు తక్కువగానే ఉండొచ్చు.

మోతాదుకి మించి ఆల్కహాల్‌ తీసుకోవడం, అధిక పని ఒత్తిడితో అలసిపోవడం.. చిన్నపిల్లలు, వయసు మీద పడిన పెద్దల బాధ్యతలను చూసుకోవాల్సి రావడం కూడా లైంగిక వాంఛలు తగ్గడానికి కారణం అవుతాయి.

గర్భం దాల్చిన సమయంలో, కాన్పు తర్వాత, చంటి పిల్లలకు చనుబాలు ఇస్తున్నప్పుడు.. చాలా మంది మహిళలకు సెక్స్ పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. హార్మోన్ల మార్పే దీనికి కారణం.

శృంగారం పట్ల ఆసక్తి కలిగేలా ఈస్ట్రోజన్ హార్మోన్ తోడ్పడుతుంది. మెనోపాజ్ దశకు చేరినప్పుడు ఈ హార్మోన్ తక్కువ స్థాయిలో విడుదల అవుతుంది. పలితంగా వెజినా పొడి బారడంతోపాటు లైంగిక ఆసక్తి తగ్గుతుంది. కలయికలో పాల్గొన్నా.. అసౌకర్యంగా, నొప్పిగా ఉంటుంది.

కుంగుబాటు, వ్యాకులత లాంటి మానసిక సమస్యల వల్ల కూడా మహిళల్లో సెక్స్ కోరికలు తగ్గుతాయి. డ్రిపెషన్ తగ్గించే మందులు, బీపీకి వాడే మందులు కీమోథెరపీ ఔషదాలు మొదలైనవి లైంగిక వాంఛలను తగ్గిస్తాయి.

పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో సమస్య వల్ల మహిళలు సెక్స్ గురించి ఆలోచించలేరు. తమ శరీరాకృతి బాగోలేదని భావన, ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల కూడా సెక్స్‌కి ప్రాధాన్యం ఇవ్వరు. అధిక బరువుతో బాధపడేవారిలో కూడా శారీరక వాంఛలు తక్కువగా ఉంటాయి.

గతంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్న అనుభవం ఉంటే.. వారిలో సెక్స్ అంటే అదో రకమైన భయం ఏర్పడుతుంది. ఫలితంగా భాగస్వామి దగ్గరకు వస్తేనే వణికిపోతారు.

చాలా మంది మహిళలు భాగస్వామితో మానసికంగా, భావోద్వేగ పరమైన అనుబంధాన్ని ఇష్టపడతారు. ఆ తర్వాతే సెక్స్‌కి ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి భాగస్వామితో ఏవైనా సమస్యలు ఉన్నా వారిలో లైంగిక వాంఛలు తగ్గుతాయి.