Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ఈ అయిదు ముందు జాగ్రత్తలతో ఎండాకాలం లో మీ చర్మాన్ని కాపాడుకోండి

ఈ అయిదు ముందు జాగ్రత్తలతో ఎండాకాలం లో మీ చర్మాన్ని కాపాడుకోండి


ఎండాకాలం చర్మానికి చాల రకాల సమస్యలను తెచ్చిపెడ్తుంది. ముఖ్యంగా ముఖ చర్మం చల్ సులభంగా జిడ్డు గ మారి గ్రీసిగ్ తయారవుతుంది. కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వార అంద వీహినంగా కనపడకుండా కాపాడుకోవడమే కాదు, చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. కొన్ని ముంది జాగ్రత్త చర్యలను పరిశిలిద్దాం
1సూర్యరశ్మికి దూరంగా ఉండండి
వీలైనంత వరకు సూర్యరశ్మికి దూరంగా ఉండండి. ప్రత్యేకంగా మిట్ట మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో వెండలో బయటకు వెళ్ళకండి. ఒక వేల వెళ్ళాల్సివస్తే తల, మొహం ఏదైనా కాటన్ చ్లొథ్ తో కవర్ చేసుక్వడం మర్చిపోవద్దు. సూర్య రశ్మి లో ఉండే UV కిరణాలు చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అంతే కాకుండా ఇవి చర్మ వయ్యసు మల్లికను త్వరిత పరుస్తాయి. ఇంకా చర్మ కాన్సర్ కు కూడా ఇవి కారణం అవుతాయి.

2సన్ స్క్రీన్ లోషన్ ను వాడడం మర్చిపోకండి
అత్యంత ప్రధానమైన సమ్మర్ స్కిన్ రొటీన్ లలో సన్ స్క్రీన్ ఒకటి. సూర్య కిరణాలలో ఉండే ఆల్ట్రా వయొలెట్ కిరణాలు సున్నితమైన చర్మానికి చాల హాని కారకాలు. ఇవి చర్మాని తేలిగ్గా రంగు కోల్పోయేలా చేస్తాయి. అన్నిటికంటే ముఖ్య విషయం, ఈ ఆల్ట్రా వయొలెట్ కిరణాలు సూర్య కాంతి లోనే కాదు మాములు వాతావరణంలో కూడా ఉంటాయి అందుకే ఇంట్లో ఉన్నప్పటికీ వీటిని వాడడం మానొద్దు.

3మేకప్ తగ్గించండి
వీలైనంత వరకు మేకప్ తగ్గించండి. హెవీ మాయిచ్చారైజర్ లు ఎండాకాలంలో చర్మలోని స్వేద రంద్రాలను ముసివేయడానికి అవకాశాలున్నాయి. తద్వారా వివిధ రకమైన ఇన్ఫెక్ట్స్ రావడమే కాకుండా, చర్మం కూడా డల్ గ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే హెవీ కాని మాయిచ్చారైజర్ లు, ఫౌండేషన్లు మాత్రమే వాడండి దీనితో చర్మం తేలిగ్గా శ్వాస తీసుకుంటుంది.
4ఎక్కువ సార్లు మొహాన్ని కడగకండి
మొహం కడగడాన్ని ఉదయాన్నే మరియు పడుకునే ముందుకి పరిమితం చేస్తే మంచిది. వాతావరణం లో తేమ లేమి వలన చర్మం సులభామ్న్గా పొడి బారుతుంది. పొడి బారిన చర్మం సహజ మెరుపును కోల్పోవడమే కాకుండా ముడుతలు పడడానికి కూడా దారి తీస్తుంది. దీంతో చర్మం వయసు పై బడినట్టు కనపడుతుంది. దీని నివారణకై చర్మాన్ని ఎక్కువ సార్లు కదగాక పోవడం మంచిది. మరియు కడిగిన ప్రతిసారి మాయిచ్చారైజర్ రాయడం కూడా ముఖ్యమే.

5ద్రావణాలను పుష్కలంగా త్రాగండి
ఎండా కాలంలో విరివిగా ద్రావణాలను తీసుకోండి. ఎంత ఎక్కువగా మంచి నీళ్ళు త్రాగితే అంత ఆరోగ్యమే కాదు, చర్మ సౌందర్యం కూడా. దీనితో శరీరం లోని మలినాలు బయటకు వెళ్ళడానికి మార్గం సుమమవుతుంది. డి హైడ్రేషన్ అవకుండా చూసుకోవడం వలన చర్మం పొడి బారకుండ కూడా ఉంటుంది.